బిజినెస్

కురులు కాదు.. సిరులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, ఫిబ్రవరి 4 : కలియుగ ప్రత్యక్షదైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి 4.59 కోట్ల రూపాయల ఆదాయాన్ని గడించింది. గురువారం నాడు తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ - వేలంలో మొత్తం 9 వేల కిలోల తలనీలాలు అమ్ముడుపోయాయి. తలనీలాలలో మొదటి రకం (31 ఇంచుల పైన), రెండో రకం (16 నుండి 30 ఇంచులు), మూడో రకం (10 నుండి 15 ఇంచులు), నాలుగోరకం (5 నుండి 9 ఇంచులు), ఐదో రకం (5 ఇంచుల కన్నా తక్కువ), తెల్లవెంట్రుకల రకాలను టిటిడి ఈ-వేలంలో పెట్టింది. కిలో 25563 రూపాయలుగా ఉన్న మొదటి రకం తలనీలాలను మొత్తం 2600 కిలోలను వేలానికి ఉంచగా ఏవీ అమ్ముడుపోలేదు. అలాగే కిలో 19042 రూపాయలుగా ఉన్న రెండో రకం తలనీలాలను మొత్తం 34.500 కిలోలను వేలానికి ఉంచగా 2.200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా 4.19 కోట్ల ఆదాయం సమకూరింది. అలాగే కిలో 4540 రూపాయలుగా ఉన్న మూడో రకం తలనీలాలను మొత్తం 67700 కిలోలను వేలానికి ఉంచారు. ఇందులో 700 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా 31.78 లక్షల రూపాయల ఆదాయం లభించింది. కిలో 3583 రూపాయలుగా ఉన్న నాలుగోరకం తలనీలాను 12,100 కిలోలను వేలానికి ఉంచారు. ఏవీ అమ్ముడుపోలేదు. కిలో 31 రూపాయలుగా ఉన్న ఐదో రకం తలనీలాలను 25000 కిలోలను వేలానికి ఉంచగా 6000 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా 1.86 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే కిలో 6706 రూపాయలుగా ఉన్న తెల్ల వెంట్రుకలను 1500 కిలోలను అమ్మకానికి ఉంచారు. 100 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా 6.70 లక్షల ఆదాయం వచ్చింది.