బిజినెస్

ఐటి రంగంలో కొలువుల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఫిబ్రవరి 4: ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవంతో కుప్పలు తెప్పలుగా ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో డిజిటల్ సేవలపై కేంద్రప్రభుత్వం దృష్టి సారించడం, ప్రధాని నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా నినాదంతో ఉద్యోగాల కల్పనకు ఊపువచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో అత్యధిక ఐటీ సంస్థలు, మల్టీ నేషనల్ కంపెనీలు, డిజిటల్ సేవలపై దృష్టి కేంద్రీకరించడమే ఇందుకు కారణమని టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. ఐటి రంగంలో ఈ ఏడాది 2.50 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు డిజిటల్ మార్కెటింగ్ రంగంలో కూడా లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నట్లు నాస్‌కాం సంస్థ తన సర్వేలో పేర్కొంది. ఐటి రంగంలో ఉద్యోగాల కల్పన 2015లో 12 శాతం వృద్ధి ఉంటే 2016లో 16 శాతం పెరగవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఐటి రంగంలో ఎంఎన్‌సి కంపెనీలతో సహా ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగంతోపాటు ఉన్నత చదువులు అన్న నినాదంతో ప్రాంగణ ఎంపికలు చేపడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఐటి రంగంలో డిజిటల్ టెక్నాలజీ ప్రవేశించడంతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. మల్టీనేషనల్ కంపెనీలు ప్రతి ఏడాది ఉద్యోగాలు భర్తీ చేసేందుకు నైపుణ్యం కలిగిన విద్యార్థులను కళాశాల ప్రాంగణ ఎంపికలు నిర్వహించి ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇస్తున్నాయి. అయితే నైపుణ్యం గలవారికి ఇతర పోటీసంస్థల నుండి మంచి ఆఫర్లు వస్తున్న కారణంగా చేస్తున్న ఉద్యోగాన్ని, సంస్థను వదిలేసి వెళ్లడం ఎక్కువైంది. దీంతో మల్టీ నేషనల్ కంపెనీలు తమ లక్ష్యాలను మార్చుకుని గ్రామీణ ప్రాంతాలకు చెందిన చురుకైన విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ఉద్యోగ శిక్షణ ఇవ్వడంతోపాటు ఉన్నత చదువులకు అవకాశాలు కల్పిస్తూ 5-6 సంవత్సరాల పాటు ఉద్యోగులను తమ గుప్పిట్లో ఉంచుకునే విధంగా సరికొత్త వ్యూహాలతో ముందుకు పోతున్నారు. దీంతో ఆదాయం ఆర్జిస్తూ ఉన్నత చదువులు చదువుకునేందుకు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఇటీవలి కాలంలో విప్రో, టిసిఎస్ తదితర సంస్థలు ఆంగ్ల మాధ్యమంలో సంప్రదాయక డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులను ఎంపిక చేసుకుని వారికి ఆకర్షణీయమైన వేతనాలు, ఉన్నత చదువుల అవకాశాలను కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. విప్రో సంస్థ వారు విస్టా, వేజ్ ప్రోగ్రామ్‌లతో ప్రాంగణ ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసుకున్న డిగ్రీ విద్యార్థి ఆయా సంస్థల్లో నాలుగు సంవత్సరాల పాటు వారానికి నాలుగు రోజులు కంపెనీకి సేవలు అందిస్తూ మిగతా మూడు రోజులు మంచి విద్యాసంస్థల్లో ఎంటెక్, ఎంఎస్ తదితర కోర్సులు చదువుకునే వెసులుబాటు ఉంది. ఈ మేరకు కంపెనీలే నేరుగా ఆయా యూనివర్శిటీలతో ఒప్పందాలు చేసుకుని తమ సంస్థలో ఎంపికైన వారికి ఉన్నత చదువుల అవకాశాన్ని కల్పిస్తున్నాయి. విప్రో సంస్థ వారు ప్రాంగణ ఎంపికల్లో ఎంపిక చేసుకున్న వారికి నాలుగు సంవత్సరాల ఎంటెక్ కోర్సును బిట్స్ పిలాని విట్ యూనివర్శిటీలలో అమలుచేస్తున్నారు. ఎంటెక్, ఎంఎస్ ప్రోగ్రాం అయిన అనంతరం ఒక సంవత్సరం పాటు సంస్థలో ఏడాదికి రూ.10 లక్షల వేతనంతో పనిచేయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆకర్షణీయమైన వేతనం అందడం వల్ల ఉద్యోగుల వలసలను ఆపవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. టిసిఎస్ కంపెనీ సైతం ఇటీవల ఎంపిక చేసుకున్న వారిని ఇగ్నైట్ ప్రోగ్రాం ద్వారా చెన్నైలోని శస్త్ర యూనివర్శిటీలో నాలుగు సంవత్సరాల ఎంసిఎ కోర్సులో చేర్పించింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ సంస్థ కూడా ఆదాయం ఆర్జిస్తూ ఉన్నత చదువుల అవకాశాలను కల్పిస్తుండడం వల్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్ డిగ్రీలు అవసరం లేదని, సంప్రదాయక డిగ్రీ చదువుతున్న విద్యార్థులూ అర్హులని ప్రకటిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఐటి రంగంలో ఉద్యోగాల కల్పన కోసం టిసిఎస్‌తో ఎపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ ఏడాది 1000 ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ప్రతి జిల్లాలో డిగ్రీ కళాశాలల్లో ప్రాంగణ ఎంపికలు నిర్వహించి తమకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకుంటున్నారు.