బిజినెస్

బ్లూచిప్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లకు మళ్లీ లాభాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 4: గత మూడు జులుగా నష్టాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం తిరిగి లాభాల బాటలో సాగాయి. ఇటీవల బాగా దెబ్బతిన్న రంగాల షేర్లలో విలువ ఆధారంగా కొనుగోళ్లు జరగడం దీనికి ప్రధాన కారణం. మరో వైపు డాలరుతో రూపాయి దాదాపు 37 పైసలు బలపడ్డం కూడా దీనికి దోహదపడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగడం, చమురు ధరలు తిరిగి పెరుగుతున్న కారణంగా బుధవారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగియడంతో ఐరోపా మార్కెట్లు కూడా ప్రారంభంలోనే లాభాల్లో సాగడం ఇవన్నీ కూడా మార్కెట్లు లాభాల్లో ముగియడానికి దోహదపడ్డాయి. అయితే కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో మదుపరుల భయాలు అలాగే కొనసాగుతున్నాయని బ్రోకర్లు అంటున్నారు. అమ్మకాలు, కొనుగోళ్ల కారణంగా బిఎస్‌ఇ సెనె్సక్స్ రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ , చివరికి 115.11 పాయింట్ల లాభంతో 24,338.43 పాయింట్ల వద్ద ముగిసింది. లావాదేవీల మధ్యలో ఈ సూచీ 24,514-24,225 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. చమురు ధరలు తగ్గడం ప్రారంభమైన తర్వాత వృద్ధి రేటు మందగించవచ్చన్న భయాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం అవుతుండడంతో మదుపరులు ఆసియా మార్కెట్లనుంచి కూడా భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ ఉండడం తెలిసిందే. ఫలితంగా గత మూడు రోజుల్లో సెనె్సక్స్ 647 పాయింట్లకు పైగా నష్టపోయింది. కాగా, జాతీయ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 42.40 పాయింట్లు లాభపడి తిరిగి 7400 పాయింట్ల ఎగువకు చేరుకుంది. ఒక దశలో 7,457 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన సూచీ చివరికి 7,404 పాయింట్ల వద్ద ముగిసింది.
చమురు ధరలు తిరిగి పుంజుకుంటూ ఉండడం, ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లను పెంచకవచ్చన్న ఊహాగానాల కారణంగా ప్రపంచ మార్కెట్లలో నిలకడ ధోరణలు కనిపిస్తున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా నష్టపోయిన పలు బ్లూచిప్ షేర్లుఆకర్షణీయంగా మారడంతో మదుపరులు వాటి కొనుగోలుకు మొగ్గు చూపించారని బ్రోకర్లు అంటున్నారు. ఫలితంగా ఓఎన్‌జిసి షేరు అత్యధికంగా 3.28శాతం పెరిగింది. ఏసియన్ పెయింట్, ఎల్‌అండ్‌టి, టాటా మోటార్స్ కూడా మంచి లాభాలను ఆర్జించాయి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 18 కంపెనీల షేర్లు లాభపడగా, 12 నష్టపోయాయి. నష్టపోయిన వాటిలో లుపిన్, ఎన్‌టిపిసి, సిప్లా, ఎస్‌బిఐ, బజాజ్ ఆటో, గెయిల్, మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, రిల్ ఉన్నాయి.
ఆసియా మార్కెట్లలో షాంఘై, హాంకాంగ్, సింగపూర్ మార్కెట్ల సూచీలు లాభాలతో ముగియగా, జపాన్ ప్రధాన సూచీ నిక్కీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాల్లో సాగాయి. కాగా, విద్యుత్, ఆటోమేషన్ టెక్నాలజీల సంస్థ ఎబిబి ఇండియా నికర లాభాలు డిసెంబర్ 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 53.75 శాతం పెరగడంతో గురువారం స్టాక్ మార్కెట్లలో ఆ కంపెనీ షేరు ఏకంగా 14.5 శాతం పెరిగింది.