బిజినెస్

మార్కెట్లలో ఆగని పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 21: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 12 ఏళ్లలో ఎన్నడూ లేనంత దిగువకు పడిపోవడంతో ఆసియా మార్కెట్లన్నిటిలో పెద్ద ఎత్తున అమ్మకాల కారణంగా గురువారం దేశీయ మార్కెట్ బెంచ్‌మార్క్ అయిన బిఎస్‌ఇ సెనె్సక్స్ మరో వంద పాయింట్లు పడిపోయింది. దీంతో 20 నెలల తర్వాత తొలిసారిగా సెనె్సక్స్ 24 వేల పాయింట్ల దిగువకు చేరుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం 7,300 పాయింట్ల దిగువకు పడిపోయింది. ప్రారంభంలో లాభాల తర్వాత బ్లూచిప్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, ఈ వారం మరిన్ని కీలక కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం, దీనికి తోడు డాలరుతో రూపాయి మరింత బలహీన పడడం ఇవన్నీ కూడా మార్కెట్‌పై ప్రభావాన్ని చూపించాయి. ఇదిలా ఉండగా అంతర్జాతీయ మార్కెట్‌లో ఇప్పటికే బ్యారెల్ 28 డాలర్లకు పడిపోయిన ముడి చమురు గురువారం మరింత దిగజారింది.
బుధవారం భారీ నష్టాలు చవి చూసిన సెనె్సక్స్ నిన్నటి ముగింపుకన్నా పైస్థాయిలో 24,194.75 పాయింట్ల వద్ద ప్రారంభమై పలు బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా ప్రారంభంలోనే 24, 351.83 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే ఆ లాభాలను నిలబెట్టుకోలేక ఆ తర్వాత 24 వేల పాయింట్ల దిగువకు పడిపోవడమే కాకుండా ఒక దశలో 23,862 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరికి 99.83 పాయింట్ల నష్టంతో 23,962.21 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 15 తర్వాత సెనె్సక్స్ 24 వేల పాయింట్ల దిగువన ముగియడం ఇదే మొదటిసారి. నేషనల్ స్టాక్ ఎఖ్సచేంజి సూచీ నిఫ్టీ సైతం 32.50 పాయింట్లు నష్టపోయి 7276.80 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 30 తర్వాత నిఫ్టీ 7,300 పాయింట్ల దిగువకు చేరడం ఇదే మొదటిసారి. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 16 షేర్లు నష్టపోగా, భారతీ ఎయిర్‌టెల్ నిలకడగా నిలిచింది. మారుతి సుజుకి షేరు 4.1 శాతం నష్టపోగా, డాక్టర్ రెడ్డీస్ షేరు 3.86 శాతం పడిపోయింది. టాటా మోటార్స్, కోల్ ఇండియా, సన్‌ఫార్మా, ఒఎన్‌జిసి, హిందుస్థాన్ యుని లీవర్, సిప్లా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టి, ఎంఅండ్ ఎం, ఐటిసి నష్టపోయిన వాటిలో ఉన్నాయి. కాగా, డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రైవేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ లాభాలు 15 శాతం వృద్ధి చెందడంతో ఆ బ్యాంక్ షేరు 5.21 శాతం పెరిగింది. విప్రో, ఇన్ఫోసిస్, ఎస్‌బిఐ, టాటా స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, ఎన్‌టిపిసి, బిహెచ్‌ఇఎల్ లాభపడిన వాటిలో ఉన్నాయి. కాగా, అంతర్జాతీయంగా ఆసియా ప్రధాన మా

దేశీయంగా రక్షణ ఉత్పత్తులు
ఇప్పట్లో ఉండకపోవచ్చు
ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అంచనా
ముంబయి, జనవరి 21: రక్షణ పరికరాల కొనుగోలు నిబంధనల విధానంలో ప్రతిపాదించిన మార్పుల కారణంగా ఈ రంగంలో దేశీయ తయారీ విపరీతంగా పెరుగుతుందని భారీ అంచనాలున్నప్పటికీ సమీప భవిష్యత్తులో ఇది సంభవించే అవకాశాలు కనిపించడం లేదని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇటీవలి నివేదిక అభిప్రాయ పడింది. భారత దేశం గతంలో అనేక అవకాశాలను కోల్పోయింది. రక్షణ రంగ పరికరాల ఆర్డర్ల కారణంగా అర్థవంతమైన దేశీయ వ్యాపారానికి దారితీసే స్థాయికి ఈ రంగం చేరుకునే స్థితి ఇంకా చాలా దూరంగానే ఉందని ఆ నివేదిక అభిప్రాయ పడింది. ‘రక్షణ పరికరాల కొనుగోలు నిబంధనలు (డిపిపి) 2013, దానికి చేయబోయే మార్పుల విషయంలో బోలెడంత ఆసక్తి తలెత్తినప్పటికీ రక్షణ పరికరాల తయారీ దేశీయ ఉత్పత్తి రంగానికి మారడం అనేది సమీప భవిష్యత్తులో జరిగేట్లుగా కనిపించడం లేదు’ అని ఆ నివేదిక స్పష్టం చేసింది. అలాంటి పరిస్థితుల్లో రక్షణ కంపెనీ విలువల్లో ఒక్కసారిగా గణనీయమైన మార్పువస్తుందని ఆశించినా అది అట్టే నిలబడబోదని కూడా ఆ నివేదిక అభిప్రాయ పడింది. రక్షణ పరికరాల తయారీలో ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించడానికి వీలుగా రక్షణ పరికరాల కొనగోలు నిబంధనల విధానంలో అవసరమైన మార్పులు సూచించి, ఈ విధానాన్ని హేతుబద్ధం చేయడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జూన్ నాటికల్లా ఈ నూతన విధానాన్ని ఖరారు చేస్తామని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సైతం ఇటీవల చెప్పారు.