బిజినెస్

పరిశ్రమలకు ‘లీడర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: తెలంగాణ రాష్ట్రం దేశంలో పరిశ్రమలకు లీడర్‌గా నిలిచింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ ఒకేసారి పదమూడో స్థానం నుంచి మొదటి స్థానంలోకి వచ్చింది మరి. 90 నుంచి వంద పాయింట్లు వచ్చిన రాష్ట్రాలను లీడర్స్‌గా పేర్కొన్నారు. ఈ పాయింట్లలో రెండు తెలుగు రాష్ట్రాలు సమాన పాయింట్లను సాధించాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. 98.78 శాతం మార్కులతో తెలంగాణ మొదటి స్థానం దక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ప్రపంచ బ్యాంకు ఈ నివేదికలను రూపొందిస్తోంది. నిరుడు ఆంధ్రప్రదేశ్‌కు రెండవ స్థానం లభించగా, తెలంగాణకు 13వ స్థానం వచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా టిఎస్‌ఐపాస్ విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతి ఇస్తున్నారు. నిర్ణీత గడువులో అనుమతి ఇవ్వకపోతే అనుమతి లభించినట్టుగానే భావించాలి. ఇలాంటి విధానం దేశంలో మరెక్కడా లేదు. పైసా లంచం ఇవ్వకుండా మేం అనుమతులు పొందాం అని సెల్‌కాన్ లాంటి ప్రముఖ కంపెనీలు ప్రకటించడం గమనార్హం. టిఎస్‌ఐపాస్ విధానం తరువాత కొత్త పరిశ్రమల కోసం వందలాదిగా దరఖాస్తులు వచ్చాయి. అలాంటి సమయంలో నిరుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణకు 13వ స్థానం లభించడం తెలంగాణ ప్రభుత్వాన్ని విస్మయ పరిచింది. పొరపాటు ఎక్కడ జరిగిందో గుర్తించిన తరువాత మార్పులు మొదలు పెట్టారు. అప్పటి వరకు పరిశ్రమల శాఖ జూపల్లి కృష్ణారావు నిర్వహించగా, ఐటి శాఖను కె తారక రామారావు నిర్వహించారు. ఐటితో పాటు పరిశ్రమలు అన్నీ ఒకే మంత్రి వద్ద ఉంటే ప్రయోజనకరంగా ఉంటుందనే ఉద్దేశంతో శాఖల్లో మార్పులు చేశారు. జూపల్లి కృష్ణారావుకు గ్రామీణాభివృద్ధి శాఖను అప్పగించి, కెటిఆర్‌కు ఐటితో పాటు మున్సిపల్ వ్యవహారాలు, పరిశ్రమల శాఖలను అప్పగించారు. పరిశ్రమల శాఖను చేపట్టిన తరువాత కెటిఆర్ తరుచుగా సమావేశాలు నిర్వహించారు. ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏయే అంశాలను ప్రాతిపదికగా తీసుకుని మార్కులు కేటాయిస్తున్నారో పరిశీలించి ఆయా మార్పులు చేశారు. అధికారుల్లో కదలిక వచ్చింది. కాగా, 2015లో 13వ స్థానం లభించడం వల్ల అప్పటికప్పుడు నష్టం కలగకపోయినా ఇతర దేశాల్లోని వారు పెట్టుబడులు పెట్టే సమయంలో ఈ అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారని అందుకే ఈ సంవత్సరం తీవ్రంగా కృషి చేసి మంచి ఫలితాలను సాధించినట్టు పరిశ్రమల వర్గాలు తెలిపాయి.
ఎటూ తేలని తెలంగాణ ఫిర్యాదు
ఇక తాము రూపొందించిన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ కాపీ కొట్టిందని ఆధారాలతో తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పరిశ్రమల శాఖకు ఫిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన దానిలో స్పెల్లింగ్ తప్పులతో సహా యథాతథంగా కాపీ చేశారని ఫిర్యాదు చేశారు. తుది ఫలితాలు ప్రకటించే సమయంలో ఈ అంశాన్ని గుర్తించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరుడు ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంటే, తెలంగాణ 13వ స్థానంలో ఉందని, 13వ స్థానంలో ఉన్నవారిని రెండవ స్థానంలో ఉన్నవారు ఎలా కాపీ కొడతారు అని తెలంగాణ ఫిర్యాదును కొట్టిపారేస్తూ ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ సంక్షిప్త ప్రకటన విడుదల చేసింది. అయితే తెలంగాణ లేవనెత్తిన అంశాలపై మాట్లాడలేదు. తెలంగాణ చేసిన ఫిర్యాదుపై కేంద్ర పరిశ్రమల శాఖ కూడా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. చిత్రంగా రెండు రాష్ట్రాలకు ఇప్పుడు సమాన పాయింట్లు వచ్చాయి. రెండు రాష్ట్రాలు నంబర్ వన్‌గానే నిలిచాయి. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మొత్తం 32 ఉండగా, వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచాయి.