బిజినెస్

వౌలిక రంగం పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో వౌలిక రంగం వృద్ధిరేటు 3 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 5 శాతాన్ని చేరింది. సిమెంట్, ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తుల పనితీరు బాగుండటమే ఇందుకు కారణం. ఎనిమిది కీలక రంగాలైన బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాల్లో వృద్ధిరేటు నిరుడు సెప్టెంబర్‌లో 3.7 శాతంగా నమోదైంది.
అయితే ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇది 5 శాతానికి పెరిగింది. సిమెంట్, ఉక్కు, రిఫైనరీ ఉత్పత్తుల పనితీరు వరుసగా 5.5 శాతం, 16.3 శాతం, 9.3 శాతానికి ఎగిసింది. కాగా, అంతకుముందు నెల ఆగస్టులో వౌలిక రంగం వృద్ధిరేటు 3.2 శాతంగా ఉంది. ఇక సోమవారం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో వౌలిక రంగం వృద్ధిరేటు 4.6 శాతంగా నమోదైంది.
గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 2.6 శాతంగా ఉంది. అయితే ఈ సెప్టెంబర్‌లో ఎరువులు, విద్యుదుత్పత్తి 2 శాతం, 2.2 శాతం చొప్పున క్షీణించాయి. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తీ 5.8 శాతం, 4.1 శాతం, 5.5 శాతం మేర పడిపోయిందని తాజా గణాం కాలు స్పష్టం చేస్తున్నాయ.