బిజినెస్

‘మూరత్ ట్రేడింగ్’నూ వీడని నష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 31: ‘సంవత్ 2073’కి నష్టాలతో స్వాగతం పలికాయి దేశీయ స్టాక్ మార్కెట్లు. ఆదివారం దీపావళి సందర్భంగా సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 7:30 గంటల మధ్య కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ గంటపాటు జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు. అమెరికా రాజకీయ పరిణామాల నడుమ అమెరికా స్టాక్ మార్కెట్లతోపాటు ఆసియా స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయ. దీంతో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 11.30 పాయింట్లు కోల్పోయి 27,930.21 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 12.30 పాయింట్లు దిగజారి 8,625.70 వద్ద నిలిచింది. నిజానికి ఆరంభంలో భారీ లాభాలతోనే మొదలైన సూచీలు సమయం గడుస్తున్నకొద్దీ నష్టాల్లోకి జారుకున్నాయి. మొదట్లో సెనె్సక్స్ 154.20 పాయింట్లు, నిఫ్టీ 40.25 పాయింట్లు పెరిగాయి. అయితే ఒకానొక దశలో సెనె్సక్స్ 50 పాయింట్లు, నిఫ్టీ 20 పాయింట్ల మేర నష్టాలనూ చవిచూశాయి. కానీ చివరకు కొంతవరకు కోలుకోగలిగాయి. పవర్, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. అయినప్పటికీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఐటి రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకుని లాభపడ్డాయి. కాగా, నిరుడు ‘సంవత్ 2072’లో సెనె్సక్స్ 123.69 పాయింట్లు, నిఫ్టీ 41.65 పాయింట్లు లాభపడ్డాయి. దీపావళి సందర్భంగా యేటా గంటపాటు ప్రధాన స్టాక్ మార్కెట్లైన బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో మూరత్ ట్రేడింగ్ జరపడం సంప్రదాయం. ఇందులో సహజంగా మదుపరులు కొనుగోళ్లతో సూచీలను లాభాల్లో నడిపిస్తారు. ఇక సోమవారం ‘దీపావళి బలిప్రతిపద’ కారణంగా మార్కెట్లు మూతపడ్డాయ. మంగళవారం యథాతథంగా ట్రేడింగ్ జరుగుతుంది.