బిజినెస్

రేస్ ‘పవర్’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: తెలంగాణ రాష్ట్రంలో 5.75 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని, వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించామని రేస్ పవర్ ఇన్‌ఫ్రా సంస్థ డైరెక్టెర్ సంజయ్ గరుడాపల్లి తెలిపారు. ఏడు నెలల వ్యవధిలో తాము ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. కాగా, టర్న్ కీ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును రేస్ పవర్ ఇన్‌ఫ్రా పూర్తి చేసింది. మెదక్ జిల్లాలో 27 ఎకరాల స్థలంలో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయగా, ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి ప్రారంభం కావడంతో మొత్తం తమ సంస్థ దేశీయ సౌర విద్యుదుత్పత్తి 320 మెగావాట్లకు చేరిందని, తెలంగాణలోనైతే 76 మెగావాట్లకు చేరుకుందని సంజయ్ శుక్రవారం తెలియజేశారు.

జెసి బయోటెక్‌లో అడ్వాన్స్‌డ్ ఎంజైమ్స్‌కు మెజారిటీ వాటా

హైదరాబాద్, అక్టోబర్ 28: హైదరాబాద్‌కు చెందిన జెసి బయోటెక్ సంస్థలో 70 శాతం వాటాలను టేకోవర్ చేసినట్లు అడ్వాన్స్‌డ్ ఎంజైమ్స్ ఎండి సిఎల్ రథి తెలిపారు. 50 కోట్ల రూపాయలతో ఈ టేకోవర్ జరిగిందన్నారు. ఈ మేరకు ఒప్పందాలు ఖరారయ్యాయని చెప్పారు. ఓమెగా 3్ఫ్యటీ యాసిడ్, ఆల్గాల్ డిహెచ్‌ఏ, బయోఫార్మా మాలిక్యూల్స్‌ను తయారు చేస్తున్న జెసి బయోటెక్‌కు మంచి పేరుందని వివరించారు. ఈ ఉత్పత్తులకు సంబంధించి భారత మార్కెట్‌లో 50 శాతం వాటా జెసి బయోటెక్‌కు ఉందని శుక్రవారం తెలిపారు.