బిజినెస్

కోర్టుల్లో కేవియట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 25: సైరస్ మిస్ర్తిని టాటా గ్రూప్ చైర్మన్‌గా తొలగిస్తూ టాటా సన్స్ సంచలన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిస్ర్తి న్యాయపోరాటానికి దిగుతుండటంపై టాటాలు స్పందించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా సుప్రీం కోర్టు, బాంబే హైకోర్టుతోపాటు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేవియట్లు దాఖలు చేశారు. సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో మిస్ర్తికి టాటా సన్స్ ఉద్వాసన పలికినది తెలిసిందే. దీనికి కారణాలు వెల్లడించకపోయినా.. మిస్ర్తి తీరుతో చారిత్రాత్మక సంస్థ వ్యాపారాలు దెబ్బతింటున్నాయన్నదే టాటాల భావన అని సమాచారం. ఇకపోతే నాలుగు నెలలపాటు టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా వ్యవహరించనుండగా, ఈ నాలుగు నెలల్లో కొత్త సారథిని తీసుకురానున్నారు. ఇందు కోసం ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. కాగా, వ్యాపారంపై, మార్కెట్ లీడర్‌షిప్‌పై దృష్టి పెట్టాలని సిఇఒలను రతన్ టాటా కోరారు.
100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన టాటా గ్రూప్‌లో 100కుపైగా సంస్థలున్నాయి. సాల్ట్ టు సాఫ్ట్‌వేర్, హెయిర్‌పిన్ టు ఏరోప్లేన్ గ్రూప్‌గా టాటా గ్రూప్ సుపరిచితం. కాగా, మంగళవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో కొత్తగా మరో ఇద్దరు డైరెక్టర్లను బోర్డులోకి తీసుకుంది టాటా సన్స్. ఆటో సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ సిఇఒ రాల్ఫ్ స్పెత్, ఐటి సంస్థ టిసిఎస్ సిఇఒ ఎన్ చంద్రశేఖరన్‌లు అదనపు డైరెక్టర్లుగా బోర్డులోకి వచ్చారు.
మరోవైపు మిస్ర్తి వ్యవహారంపై న్యాయపోరాటం చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మిస్ర్తికి చెందిన షాపూర్జీ పల్లోంజి మిస్ర్తి గ్రూప్ తెలిపింది. అయితే టాటా సన్స్‌తోపాటు రతన్ టాటా, టాటా ట్రస్ట్, టాటా గ్రూప్ తదితర సంస్థలపై మిస్ర్తి కోర్టుల్లో కేవియట్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై మాత్రం స్పష్టత లేకుంది. టాటా సన్స్‌లో మిస్ర్తి గ్రూప్‌కు 18.4 శాతం వాటా ఉంది. ఇదిలావుంటే మిస్ర్తి ఉద్వాసనతో బ్రిటన్‌లో టాటా స్టీల్ భవితవ్యం మళ్లీ బాగుంటుందన్న అంచనాలు అంతర్జాతీయ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.