బిజినెస్

తెలంగాణ అభివృద్ధికి ఇండియన్ బ్యాంక్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 10: అభివృద్ధి దిశగా పయనిస్తున్న నూతన తెలంగాణ రాష్ట్రం దేశ, విదేశాల ఇనె్వస్టర్లను ఆకర్షిస్తున్న తరుణంలో అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి అవసరమైన పెట్టుబడులను అందించేం దుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ బ్యాంక్ తెలిపింది. ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ సిఇఒ మహేశ్ కుమార్ జైన్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావును సోమవారం క్యాంపు కార్యాలయంలో తన బృందంతో కలిశారు.
హెచ్‌ఎండిఎ, జిహెచ్‌ఎంసి పరిధిలో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు ఆర్థిక సహకారం రుణం రూపంలో అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలో అభివృద్ధి కేంద్రాలుగా రూపుదిద్దుకుంటున్న పట్టణాల పరిధిలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి కెసిఆర్‌కు తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వా మ్యం కావడానికి ఇండియన్ బ్యాంక్ ముందుకు రావడం శుభపరిణామం అని, వారిని ఆహ్వానిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు, ఇతర అభివృద్ధి, సేవా రంగాల వ్యవస్థల బలోపేతానికి ఇండియన్ బ్యాంక్ అందించే ఆర్థిక సహకారం దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, వైద్య ఆరో గ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, సిఎంఒ ప్రిన్సిల్ సెక్రెటరీ నర్సింగ్ రావు, అదనపు ప్రిన్సిపల్ సెక్రెటరీ శాంతికుమారి, టిఎస్‌ఐపాస్ ఎండి నరసింహారెడ్డి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, మాణిక్‌రావు పాల్గొన్నారు.
chitram...
సోమవారం తెలంగాణ సిఎం క్యాంపు కార్యాలయంలో
కెసిఆర్‌ను కలిసిన ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు