బిజినెస్

కాశ్మీరులో జరిగేది ‘స్వాతంత్య్ర పోరాటం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 10: కాశ్మీరు విషయంలో భారత్‌పై పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. కాశ్మీరులో జరుగుతున్నది ‘స్వాతంత్య్ర పోరాటమని’, దీనిని ఉగ్రవాదంతో ముడిపెడితే భారత్ ‘పొరపాటు’ చేసినట్టే అవుతుందని అన్నాడు. ఇస్లామాబాద్‌లో సోమవారం జరిగిన పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నవాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాశ్మీరీలు తమ స్వయం నిర్ణయాధికార హక్కు కోసం పోరాడుతున్నారని, ఈ విషయంలో వారికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తుందని ఆయన చెప్పాడు. ‘కాశ్మీరు అంశానికి పాక్ కట్టుబడి ఉంది. కాశ్మీరీల స్వాతంత్య్ర పోరాటానికి మద్దతు తెలుపకుండా మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశాడు. జమ్మూ-కాశ్మీరులోని ఉరీలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడికి పాల్పడిన అనంతరం నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉగ్రవాద స్థావరాలపై భారత్ లక్ష్యిత దాడులు నిర్వహించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన తరుణంలో పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశాడు. భారత్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల గురించి చర్చించేందుకు నవాజ్ షరీఫ్ గతవారం మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించడంతోపాటు పాకిస్తాన్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన విషయం విదితమే. నవాజ్ షరీఫ్ కుటుంబ సభ్యుల అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 30న రాజధాని ఇస్లామాబాద్‌ను దిగ్బంధిస్తామని పాక్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఇటీవల చేసిన హెచ్చరికను ఏ విధంగా తిప్పికొట్టాలన్న దానిపై అధికార పిఎంఎల్-ఎన్ మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో నవాజ్ షరీఫ్ సోమవారం ఈ సమావేశాన్ని నిర్వహించారు.