బిజినెస్

బాక్సింగ్ వీరుడు ప్రియర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, అక్టోబర్ 10: హాల్ ఆఫ్ ఫేమ్ గౌరవాన్ని పొందిన అమెరికా వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ వీరుడు ఆరోన్ ప్రియర్ (60) మృతి చెందాడు. ప్రపంచ జూనియర్ వెల్టర్‌వెయిట్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న తర్వాత అమెరికాలో మహమ్మద్ అలీకి అసలైన వారసుడిగా పేరు సంపాదించిన ప్రియర్.. కెరీర్‌లో 40 బౌట్స్‌లో పాల్గొని, 39 విజయాలు సాధించాడు. వీటిలో 35 నాకౌట్ ద్వారా లభించినవే కావడం విశేషం. అసాధారణ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన ప్రియర్ చిన్నతనంలోనే గుండె సంబంధమైన వ్యాధికి గురయ్యాడు. ఈ కారణంగానే అతను కెరీర్‌కు అర్ధాంతరంగా గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. 1982 నవంబర్ 12న మియామీ ఆరంజ్ బౌల్‌లో అలెక్సిస్ ఆగ్యుల్లోతో జరిగిన ఫైట్ ‘బ్యాటిల్ ఆఫ్ ది చాంపియన్స్’గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించింది. 14 రౌండ్లు సాగిన ఈ ఫైట్‌లో ప్రియర్ విజయం సాధించి, యావత్ బాక్సింగ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. కాగా, అతని మృతిపై ప్రపంచ బాక్సింగ్ సంఘం (డబ్ల్యుబిఎ), అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య (ఐబిఎఫ్) దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. పలువురు ప్రస్తుత, మాజీ బాక్సర్లు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు.