బిజినెస్

ఏడాది గరిష్ఠానికి బ్రెంట్ చమురు ధర బ్యారెల్ 53.45 డాలర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, అక్టోబర్ 10: బ్రెంట్ ఆయిల్ ధర ఈ ఏడాదిలోనే గరిష్ఠ స్థాయిని తాకింది. అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి అదుపునకు రష్యా చర్యలు తీసుకుంటుందని ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంకేతాలిచ్చిన నేపథ్యంలో బ్రెంట్ ఉత్తర సముద్ర చమురు బ్యారెల్ ధర సోమవారం 53.45 డాలర్లు పలికింది. క్రితం ముగింపుతో పోల్చితే ఇది 1.53 డాలర్లు అధికం. 2015 అక్టోబర్ నుంచి గమనిస్తే ఈ స్థాయి ధర నమోదు కావడం ఇదే ప్రథమం. నాడు బ్యారెల్ ముడి చమురు ధర 54.05 డాలర్లుగా ఉంది.
క్షీణించిన బెంజ్ అమ్మకాలు
ముంబయి, అక్టోబర్ 10: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ జూలై-సెప్టెంబర్ త్రైమాసిక అమ్మకాలు స్వల్పంగా క్షీణించాయి. నిరుడు జూలై-సెప్టెంబర్‌లో 3,420 యూనిట్లను విక్రయించిన బెంజ్.. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో 3,327 యూనిట్లను అమ్మింది. కాగా, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో 2 లీటర్ల సామర్థ్యం కంటే ఎక్కువున్న డీజిల్ ఇంజిన్ల వాహనాల అమ్మకాలపై సుప్రీం కోర్టు విధించిన నిషేధం బెంజ్ అమ్మకాలను ప్రభావితం చేసింది. మూడింటా ఒక వంతు అమ్మకాలు ఢిల్లీ నుంచే బెంజ్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే సుప్రీం నిర్ణయం తమ విక్రయాలను ప్రభావితం చేసిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సోమవారం పేర్కొంది. ఈ ఏడాదిలో జనవరి-సెప్టెంబర్ మధ్య 9,924 యూనిట్లను అమ్మిన బెంజ్ నిరుడు ఇదే సమయంలో 10,079 యూనిట్లను విక్రయించింది.
ఉబర్‌తో స్టాండర్డ్ చార్టర్డ్ టై-అప్
ముంబయి, అక్టోబర్ 10: విదేశీ బ్యాంకైన స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్.. ఉబర్‌తో టై-అప్ పెట్టుకుంది. ఆరు దేశాల్లో తమ క్రెడిట్ కార్డు వినియోగదారులకు లబ్ధి చేకూరేలా ఉబర్ యాప్ ద్వారా క్యాబ్స్‌ను బుక్ చేసుకుంటే మొత్తం బిల్లులో గరిష్ఠంగా 25 శాతం వరకు డబ్బులు వెనక్కి వచ్చేలా ఉబర్‌తో స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది. భారత్‌లో 20 శాతం వర్తిస్తుందని చెప్పింది. సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, యుఎఇ దేశాల్లో ఆఫర్ చెల్లుబాటు అవుతుంది.
పెరిగిన ప్రత్యక్ష, పరోక్ష పన్నులు
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు పెరిగాయి. ప్రత్యక్ష పన్నులు దాదాపు 9 శాతం పెరిగి 3.27 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైతే, పరోక్ష పన్నులు సుమారు 26 శాతం ఎగిసి 4.08 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. వ్యక్తిగత ఆదాయం పన్నుల వాటా ప్రత్యక్ష పన్నుల్లో అధికంగా ఉంటే, ఎక్సైజ్ సుంకం వాటా పరోక్ష పన్నుల్లో ఎక్కువగా ఉంది.