బిజినెస్

స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 10: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతకుముందు వరుసగా మూడు రోజులపాటు నష్టాలకే పరిమితమైన సూచీలు.. మెటల్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటి రంగాల షేర్లకు లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కోలుకోగలిగాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 21.20 పాయింట్లు పెరిగి 28,082.34 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 11.20 పాయింట్లు అందుకుని 8,708.80 వద్ద నిలిచింది.
అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా సూచీ లాభపడగా, జపాన్, హాంకాంగ్ సూచీలకు సెలవు. ఐరోపా మార్కెట్లలో జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ సూచీలు కూడా లాభాల్లోనే కదలాడాయి.
స్టాక్ మార్కెట్లకు వరుస సెలవులు
స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండు రోజులపాటు సెలవులొచ్చాయి. మంగళవారం దసరా సందర్భంగా సెలవైతే, బుధవారం మొహర్రం పురస్కరించుకుని సెలవు. ఈ మేరకు సోమవారం అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ వర్గాలు ప్రకటించాయి. దీంతో మళ్లీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురువారమే జరగనుంది.