బిజినెస్

కింగ్‌ఫిషర్ విల్లాపై ఆతిథ్య రంగం ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 9: రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులను పలుమార్లు బ్యాంకులు వేలం వేసినప్పటికీ ఎవరి నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నది తెలిసిందే. అయితే గోవాలోని సముద్ర తీరంలోగల కింగ్‌ఫిషర్ విల్లా కోసం ఆతిథ్య రంగం నుంచి అర డజను సంస్థలు, ఓ మీడియా గ్రూప్ ఆసక్తి కనబరుస్తున్నాయి. ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి ఈ ఏడాది మే నెలలో ఈ విల్లాను స్వాధీనం చేసుకున్నాయి. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడింది. ఈ రుణాలను చెల్లించకుండా మాల్యా లండన్‌కు పారిపోగా, ఆయన తాకట్టుపెట్టిన ఆస్తులను అమ్మేందుకు బ్యాంకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.