బిజినెస్

బులియన్ మార్కెట్ వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ప్రస్తుత పండగ సీజన్‌లో పసిడి, వెండి ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయి. నానాటికి తగ్గుముఖం పడుతుండగా, గడచిన వారం రోజుల్లో 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర 1,205 రూపాయలు దిగజారితే, కిలో వెండి ధర 3,570 రూపాయలు క్షీణించింది. శుక్రవారం కూడా పుత్తడి ధర 170 రూపాయలు కోల్పోగా, వెండి ధర 920 రూపాయలు పడిపోయింది. దీంతో వారం రోజుల క్రితం 31,525 రూపాయలుగా ఉన్న 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర ఇప్పుడు 30,320 రూపాయలుగా నమోదైంది. అలాగే కిలో వెండి ధర కూడా 45,500 రూపాయల నుంచి 41,930 రూపాయలకు దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు నెలచూపులు చూస్తున్నాయి. డిమాండ్ అంతగా లేకపోవడమే దీనికి కారణమని మార్కెట్ వర్గాలు విశే్లషిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్న అభిప్రాయంతో ఆ దేశ రిజర్వ్ బ్యాంకైన ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లను పెంచనుందనే అంచనాల మధ్య మదుపరులు డాలర్‌పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో బంగారం, వెండిపై పెట్టుబడులు తరలిపోతుండగా, ఔన్సు బంగారం ధర విదేశీ విపణిలో కేవలం 1,250 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇక దేశీయ మార్కెట్ విషయానికొస్తే నిజానికి ఈ దసరా, దీపావళి పండగల సీజన్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాలి. కానీ మార్కెట్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. ఆభరణాల వర్తకులు, నాణేల తయారీదారులు, పారిశ్రామిక రంగం నుంచి కొనుగోళ్లు లేకపోవడం కూడా మార్కెట్ మందగమనానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. బుధవారం ఒక్కరోజే 99.9 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పసిడి ధర 730 రూపాయలు క్షీణిస్తే, కిలో వెండి వెల 1,750 రూపాయలు దిగజారినది తెలిసిందే. పుత్తడి ధర ఈ ఏడాదిలో కేవలం ఒక్కరోజులో ఈ స్థాయిలో పడిపోవడం ఇదే ప్రథమం.