బిజినెస్

అంచనాలకు మించి ఆర్థిక లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 7: ఈ ఏడాది ఆర్థిక లోటు అంచనాలకు మూడింతలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016-17 లో ఆర్థిక లోటు 4,858 కోట్ల రూపాయలుగా ఉంటుందని ప్రభు త్వం అంచనా వేసింది. అయితే అంచనాలు తారుమారై 13,673 కోట్ల రూపాయలకు చేరుకోనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల ఆదాయం, ఖర్చులు తదితర అంశాలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సచివాలయంలో శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 58,912 కోట్ల రూపాయల ఆదాయం రాగా, 65,315 కోట్ల రూపాయల ఖర్చయింది. ఆరు నెలలకే 6,641 కోట్ల రూపాయల మేర లోటు ఏర్పడింది. ఇంకా వెయ్యి కోట్ల మేర పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉన్నట్లు లెక్కలు తేల్చారు. దీనిపై మంత్రి యనమల మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక లోటు అంచనాలకు మించుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. లోటును అధిగమించేందుకు, ఖర్చుల నియంత్రణకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్పారు. లోటు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా డ్వాక్రా సంఘాలకు రుణమాఫీలో భాగంగా 3 వేల కోట్ల రూపాయలను వ్యక్తిగత ఖాతాలో జమ చేయనున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్లాన్, నాన్‌ప్లాన్‌లను ఎత్తివేసినందున అభివృద్ధి, అభివృద్ధియేతర అకౌంట్ల క్రింద నిధులను సమీకరిస్తామన్నారు. బ్యాంకులలో హెచ్‌ఒడిలు, స్థానిక సంస్థలకు చెందిన 16 వేల కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. అవి ఇంచుమించు 20 వేల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వాటిని ప్రభుత్వ ఖాతాలో జమ చేసేందుకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి యనమల వివరించారు. దీంతో 13 వేల కోట్ల రూపాయల పిడి అకౌంట్‌లో జమ అవుతాయని కొంత వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. ఇక సచివాలయ భవన నిర్మాణ సంస్థలకు ఇప్పటివరకు 215 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని, ఇంకా 270 కోట్ల రూపాయల మేర పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల పెంపు బకాయిలను త్వరలో చెల్లిస్తామని ప్రకటించారు. దాదాపు 11 వందల మందిని రెగ్యులరైజ్ చేశామని, అయతే సుప్రీం కోర్టు అభ్యంతరాలు ఉన్నందున కాంట్రాక్టు ఉద్యోగులపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. అయినప్పటికీ వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సుప్రీం కోర్టు అవకాశమిస్తే రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు.

అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న యనమల రామకృష్ణుడు