బిజినెస్

10 వేల మెగావాట్ల సౌర విద్యుత్.. 8 వేల మెగావాట్ల పవన విద్యుత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 7: వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో పది వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్లు, 8 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర కార్మిక, విద్యుత్ శాఖ మంత్రి ఎ అచ్చెం నాయుడు తెలిపారు. గుజరాత్‌లోని బరోడాలో శుక్రవారం జరిగిన విద్యుత్ శాఖ మంత్రుల జాతీయ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రం విద్యుత్ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా ఇప్పటికే అనంతపురం జిల్లాలో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నుంచి ఉత్పత్తిని ప్రారంభించామన్నారు. దేశంలో కేవలం పది నెలల్లోనే ఒక సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటుచేసిన ఘనత ఏపికి దక్కుతుందన్నారు. అంతర్జాతీయ విద్యుత్ ప్రమాణాలను ఏపిలో అమలు చేస్తున్నామని తెలిపారు. అందరికీ విద్యుత్ స్కీంను కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉన్నత ప్రమాణాలతో అమలు చేస్తున్నామని వివరించారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ మాట్లాడుతూ సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ క్రింద 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏపికి కేంద్రం మంజూరు చేసిందన్నారు. ఇందులోభాగంగా రాయలసీమ ప్రాంత జిల్లా అయన అనంతపురంలో 2 వేల మెగావాట్ల సోలార్ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో రెండు జిల్లాలైన కర్నూలు, కడప జిల్లాల్లోనూ వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రంలో 950 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లు ఉత్పత్తిని ప్రారంభించాయన్నారు.
ఇందులో నిరుడు 435 మెగావాట్లు, ఈ ఏడాది 436 మెగావాట్ల విద్యుత్‌ను ప్లాంట్లు ప్రారంభించాయన్నారు. కాగా, 4,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయన్నారు. పవన విద్యుత్ కింద 7 వేల మెగావాట్ల ప్లాంట్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని తెలిపిన అజయ్ జైన్.. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను పటిష్టం చేశామన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సౌర, పవన విద్యుదుత్పత్తి, సరఫరాకు సంబంధించి ముందుగా వివరాలు తెలుసుకోవడం, షెడ్యూలింగ్ వివారాల ముసాయిదాను ఏపిఇఆర్‌సి ఆమోదించిందన్నారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు.