త్వరలో ఎలుకా మజాకా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మానందం, వెనె్నల కిశోర్ ప్రధాన తారాగణంగా ఫ్రెండ్స్ ఆర్ట్స్ మూవీస్ పతాకంపై రేలంగి నరసింహారావు దర్శకత్వంలో మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు రూపొందిస్తున్న హాస్యరస చిత్రం ‘ఎలుకా మజాకా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. యు/ఎ సర్ట్ఫికెట్ లభించిన ఈ చిత్రం గూర్చి నిర్మాతలు మాట్లాడుతూ, ఓ తమాషా కథ, అద్భుతమైన కథనంతో ఎలుక ప్రధానంగా ఈ చిత్రం సాగుతుందని, ఎలుక మాట్లాడే ఈ చిత్రంలో డాన్స్ చేస్తూ ఎన్నో ఆసక్తికర సంఘటనలకు ప్రాణంపోస్తూ ఈ చిత్రం ప్రేక్షకులను నవ్విస్తుందని తెలిపారు. ఎలుకగా బ్రహ్మానందం నటించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు నచ్చుతుందని, ఊహించని విధంగా ఎలుక చేసే పనులు కథనాన్ని పరిగెత్తిస్తాయని వారు తెలిపారు. సినిమా క్వాలిటీగా రావడానికి అనేకమంది కృషిచేశారని, గ్రాఫిక్స్ కూడా అద్భుతంగా వచ్చాయని, ఇటీవల విడుదలై ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని వారు తెలిపారు. సహజంగా తన దర్శకత్వంలో రూపొందిన ప్రతి చిత్రం మూడు నాలుగు నెలల్లో రిలీజ్‌కు వస్తుందని, కానీ గ్రాఫిక్స్ ప్రాధాన్యత ఈ చిత్రానికి అధికంగా వుండడంతో ఎక్కువ కాలం పట్టిందని, కామెడీ సినిమాల్లో గ్రాఫిక్స్ అవసరం లేకపోయినా ఎలుక ప్రధానంగా వుండడంతో చేయవలసి వచ్చిందని దర్శకుడు రేలంగి నరసింహారావు అన్నారు. ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. పావని కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మూలకథ:ఇలపావులూరి మురళీమోహన్‌రావు, స్క్రీన్‌ప్లే:దివాకర్‌బాబు, కెమెరా:నాగేంద్రకుమార్, మాటలు:గంగోత్రి విశ్వనాధ్, నిర్మాతలు:మారెళ్ల నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు, కథ, దర్శకత్వం:రేలంగి నరసింహారవు.