అంతర్జాతీయం

బొలీవియాలో మంత్రిని దారుణంగా కొట్టి చంపేశారు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాపాజ్: బొలీవియాలో వారం రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం మౌనం పాటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన గని కార్మికులు డిప్యూటీ హోంమంత్రిని కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని గని కార్మికుల ఆందోళనలు ఊపందుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన కార్మికులు పండురో ప్రాంతంలో డిప్యూటీ హోంమంత్రి రొడాల్ఫో ఇలేన్స్, అతడి వ్యక్తిగత సిబ్బందిని అడ్డుకుని కిడ్నాప్ చేశారు. అనంతరం రొడాల్ఫోను దారుణంగా కొట్టి చంపేశారు. డిప్యూటీ హోంమంత్రి హత్య ఘటనలో ఇప్పటి వరకు వెయ్యిమందికి పైగా కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్మికులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు కూలీలు మృతి చెందారు.