భాస్కర వాణి

నవ్వులపాలవుతున్న ‘సెక్యులరిజం’!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అత్త పగులగొడితే పాత కుండ.. కోడలు పగులగొడితే కొత్త కుండ’ అన్న సామెతలాగా ఈ దేశంలో ‘సెక్యులరిజం’ ముసుగేసుకొన్నవాళ్లు చేసే ప్రతి పనీ గొప్పదైనట్లు కలర్ ఇస్తుంటారు. కరడుగట్టిన కమ్యూనిజం ఈ దేశ మేధోవర్గాల్లో ఉంది. అందువల్ల వారు ప్రతి విషయాన్ని ముస్లిం సంతుష్టీకరణ దృష్టితో చూస్తారు. ఇటీవల భైంసాలో అల్లర్లు జరిగాయి. అక్కడి మైనార్టీలు ఆరికటిక వారి ఇళ్లను తగులబెట్టిన దృశ్యాలు అందరూ చూశారు. కానీ తనకు సంబంధం లేని సీఏఏ బిల్లును వ్యతిరేకించే కోదండరాం దాని గురించి నోరు మెదపడు!? సరస్వతీ సమ్మాన్ పురస్కారం పొందిన కవికుల జులపాల గురువూ మాట్లాడడు!? పౌర హక్కులను తలపై మోసే మొగిలిగిద్ద కరణం ప్రొఫెసర్ మాట్లాడ్డం ఆపేస్తాడు!? అంచు పంచె కట్టుకొని తిరిగే అపర విద్యావేత్త నోరు తెరవడు!? బహుజన కులాలకే తన జీవితం అంకితం చేసాననే ప్రొఫెసర్ ‘కంచె’ దాటి బయటకు రాడు!? అన్ని ‘సందర్భా’ల్లో వ్యాసాలు రాసే సంపాదకుడు వీళ్ల గురించి ఒక్క అక్షరం రాయడు!? కారణం వాళ్లు హిందువులు కాబట్టి! ఇదంతా లౌకికవాదం ముసుగులో జరుగుతున్న ఆత్మవంచన.
ఆశ్చర్యం ఏమిటంటే ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ‘మమ్మల్ని గుర్తించండి బాబో’ అని మొరపెట్టుకొంటున్నారు. ఒక వర్గంవారిని సంతృప్తిపరచడమే ‘లౌకిక వాదం’అంటూ ప్రచారం కల్పించిన ఈ దేశ కమ్యూనిష్టులు మొదటి పాపాత్ములు. ఈ జాడ్యం అన్ని రాజకీయ పార్టీలకు అంటించారు. ‘‘అందరిని సమానంగా చూడాల్సిన రాజ్యాంగాన్ని కొందరిని ఎక్కువ సమానంగా చూడాలి’’ అనే మానసిక దౌర్భల్యంలోకి నెట్టారు. దీనికోసం చరిత్రలోకి వెళ్లాలి.
నిజానికి అందరూ ఈ దేశంలో మొదటి మైనార్టీ ప్రభుత్వం పీవీ నరసింహారావుది అనుకొంటుంటారు. కానీ అది శుద్ధ తప్పు. ఆగస్టు 1969లో జరిగిన రాష్టప్రతి ఎన్నికలో ఇందిరాగాంధీ ‘ఆత్మప్రబోధంతో ఓటు పేరిట నీలం సంజీవరెడ్డిని ఓడించి నిమ్మతోటకు పరిమితం చేసి, వి.వి. గిరిని గెలిపించింది.’ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కాంగ్రెస్ చీలిపోయి, ఇందిర ఆత్మరక్షణలో పడింది. అప్పుడు కమ్యూనిస్టు పార్టీ ఇందిరకు వెన్నుదన్నుగా నిలిచింది. అంతేగాకుండా ఆనాటి సుప్రసిద్ధ కమ్యూనిస్టు నేత కుమారమంగళం ఏకంగా ఇందిర కాబినెట్‌లోకే దూకాడు. ఇంకో కమ్యూనిస్టు నేత రజనీపటేల్ కాంగ్రెస్‌లో చేరి బాంబే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడయ్యాడు. అలాగే ఆర్కే ఖాదిల్కర్, నందిని షత్పతి, కె.వి.రఘునాథరెడ్డి, అర్జున్ అరోరా, నూరుల్‌హసన్, చంద్రజిత్‌యాదవ్, డి.పి.్ఛటోపాధ్యాయ వంటి కమ్యూనిష్టులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని పవిత్రులయ్యారు. వీళ్ల శరీరం కాంగ్రెస్; ఆత్మ కమ్యూనిజం. దాంతో భారత కార్యనిర్వహణావ్యవస్థ పరోక్షంగా ప్రచ్ఛన్న కమ్యూనిష్టుల చేతిలోకి వెళ్లింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్, కేంద్ర సాహిత్య అకాడమీ, ఎన్‌సీఆర్‌టీ వంటి సంస్థలు ఎర్ర మెదళ్లతో నిండిపోయాయి. ఆ తర్వాత ఎర్ర మేధోసృష్టికోసం ‘‘మార్క్సిస్ట్ మదర్సా’’గా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పుట్టుకు వచ్చింది. దాని ప్రభావం దేశంలోని ఇతర విశ్వవిద్యాలయాలపైబడి ఈ స్వయం ప్రకటిత మేధావులంతా కృత్రిమంగా జనించారు. ఇపుడు వీళ్ల లక్ష్యం ఈ దేశంలో ‘షరియాభోల్ష్‌విక్ విప్లవం’ తేవడం!? దానికి ముసుగే ‘సెక్యులరిజం’.
ఇపుడు భారతదేశంలో చట్టాలు కేవలం పార్లమెంట్‌లో మాత్రమే ఆమోదిస్తే సరిపోదు. ‘‘ఎవరు వీధుల్లోకి వచ్చి బలప్రదర్శన చేస్తే వాళ్లమాటే నెగ్గాలి’’ అనే సరిక్రొత్త ప్రజాస్వామ్యం ప్రబోధిస్తున్నారు. పార్లమెంటుతోపాటు జెఎన్‌యు, జామియామిల్లియా, కమ్యూనిష్టు, ఎంఐఎం కార్యాలయాల్లో కూడా చట్టాలకు ఆమోదముద్ర వేయాలన్నమాట. లేదంటే సెక్యులర్ పవిత్రత దెబ్బతింటుందట!? అలాగే అరుంధతీరాయ్, రామచంద్రగుహ, అమర్త్యసేన్, బర్ఖాదత్, యోగేంద్రయాదవ్, సీతారాం ఏచూరి, కన్హయ్యకుమార్, షెల్లారశీద్, శేఖర్‌గుప్తా వంటి కమ్యూనిష్టు కొమ్మలంతా ఆ చట్టాలను అంగీకరిస్తే గాని అది ప్రజాస్వామ్యం కాదు!?
దేశంలో వందలాది విశ్వవిద్యాలయాలున్నా కేవలం వామపక్ష, ముస్లిం విద్యార్థుల అధ్యాపకుల ప్రాబల్యం ఉన్న విశ్వవిద్యాలయాల్లోనే ఇలాంటి అలజడులు చెలరేగుతుంటాయి. ఈ గుంపుకు ఈ దేశం ఎప్పుడూ శాంతిగా ఉండవద్దని కోరిక. దేశంలో అశాంతి సృష్టించి ‘సివిల్‌వార్’ జరిగేట్లు చేయడమే లక్ష్యం. వీళ్ల చరిత్ర ఎన్నో దేశాల్లో మనం గమనించవచ్చు. ఇక్కడి అలజడికి సెక్యులరిజం ఒక తొడుగు. తాజాగా పౌరసత్వ సవరణ బిల్లు ఒక నెపం మాత్రమే. కాశ్మీర్ రావణ కాష్టం వీళ్లపాపాలకు పంటగా ఉండేది. అది సులభంగా పరిష్కారం అయ్యింది. 1990ల్లో ఒక దేశంలోనే మరొక దారుల్- ఇస్లాం సృష్టించి లక్షలాది మంది పండిట్లను కాశ్మీర్‌నుండి వెళ్లగొట్టబడితే అది ఈ సెక్యులరిస్టుల దృష్టిలో కాశ్మీరియత్. 70 ఏళ్లలో ఒక్క హిందువు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అలంకరించకపోవడమే వీళ్ల దృష్టిలో సెక్యులరిజం. రాళ్లదెబ్బలు తిన్న హిందువులు తిరగబడకుండా ఉంటే సెక్యులరిజం! ఎదురుతిరిగి కొడితే ఈ దేశంలో లౌకికవాదం ప్రమాదంలో పడినట్లే? సెక్యులరిజం పేరుతో దేశ వ్యతిరేక సంఘటనలకు ప్రోత్సాహం ఇచ్చే అధ్యాపకులు స్వయం ప్రకటిత మేధావులు. ‘‘్భరత్‌ను ముక్కలు చేస్తాం; ఇన్షా అల్లా ఇన్షా అల్లా’’ అని నినదించడం సెక్యులర్ సూత్రీకరణ. కంటికిరెప్పలా దేశాన్ని కాపాడే జవానులు 76 మంది ఛత్తీస్‌గఢ్‌లో మావోల చేతిలో మరణిస్తే ‘్భరత్ ముర్దాబాద్; మావోవాద్ జిందాబాద్’ అనే నినాదాలు జెఎన్‌యు విద్యార్థులు ఇచ్చారు. ఈ విషయాన్ని ‘‘ఏప్రిల్ 2010’’ ది టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఋజురు గడ్డం, రీడింగ్ గ్లాసులు పెట్టుకొని నిరాడంబరంగా కన్పిస్తూ ఫైవ్‌స్టార్ హోటళ్లలో సెమినార్లు జరిపే అర్బన్ నక్సల్సే ఈ ఎపిసోడ్ వెనుక ఉన్నారన్నది నిష్ఠుర సత్యం. ఈ సెక్యులర్ మేధావుల దృష్టిలో మైనార్టీలంటే కేవలం ముస్లింలు మాత్రమే. సిక్కులు, ఫార్సీలు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు ఎవరూ వీళ్ల కంటికి ఆనరు. ఆఖరుకు రోజూ డా.బాబాసాహెబ్‌ను నెత్తిన మోసుకు తిరిగే వాళ్లకైనా కనీసం బౌద్ధం కన్పించదు. పార్లమెంట్ ఆమోదించిన సీఏఏ మీద ఇంత రచ్చచేస్తున్న ఈ వర్గం ‘లౌకికవాద’ శబ్దం రాజ్యాంగంలో ఎప్పుడు చేరిందో తెలుసా? దేశ పార్లమెంటులో ఏ చర్చా- ప్రస్తావన లేకుండా రాత్రికి రాత్రి 1946లో రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిర ఈ పదాన్ని చేర్చింది. ఈ దేశ మెజార్టీ ప్రజలను అడిగే ఇది చేర్చారా? పోనీ ఏ హిందూ మెజార్టీవర్గం దానిపై కనీసం అభ్యంతరమైనా తెలిపిందా? ఇపుడు సెక్యులరిజం ముసుగులో ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాలనుండి వచ్చేవాళ్లపై ప్రేమ ఎందుకు? లోతుగా ఆలోచిస్తే సెక్యులరిజం పేరుతో వ్యతిరేకిస్తున్న సీఏఏ వీళ్ల దృష్టిలో సమస్యనే కాదు. కాశ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దుచేయడం, రామమందిర నిర్మాణానికి మార్గం సుగమంకావడం ఈ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈ రెండు అంశాలపై ఉన్న అక్కసంతా, లేని భ్రాంతి సృష్టించి దేశంలో అలజడి రేపుతున్నాయి.
ఈ చట్టం వచ్చిన తర్వాత ముస్లింలెవరూ రారని, ఇక్కడున్న ముస్లింలు వెళ్లిపోతారని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇక మేధాపాట్కర్ అయితే ఇంకో అడుగుముందుకేసి ముస్లింల ఆస్తులు లాగేసుకొంటారని ప్రచారం మొదలుపెట్టింది. మన దేశంలోకి వచ్చేందుకు పౌరసత్వ చట్టం 5 మార్గాల్లో అనుమతిస్తుందని రాజ్యాంగం చదువుకొన్న ప్రశాంత్‌భూషణ్‌కు తెలియకపోవడం విడ్డూరం. అద్నాన్ సమీ, తస్లీమానస్రీన్ ఈ చట్టంతో సంబంధంలేకుండా భారత పౌరసత్వం పొందిన విషయం వీళ్లకు తెలియదా? భారత్‌ను కీర్తించే తస్లీమానస్రీన్‌ను పట్టపగలు ప్రెస్‌క్లబ్‌లో గొప్ప సెక్యులర్ నాయకులైన మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు దాడి చేస్తారు!? ఇస్లామిక్ తీవ్రవాద చరిత్రను ప్రపంచవ్యాప్తంగా ప్రచారంచేస్తున్న తారేఖ్‌ఫతేను ఈ దేశ సెక్యులర్ భక్తులంతా అవమానిస్తారు!?
12 శతాబ్దానికి చెందిన ఢాకేశ్వరీ దేవాలయాన్ని వేరేచోటకు తరలించాలని అక్కడి మత సంస్థలు ప్రభుత్వంపై తీవ్ర వత్తిడి చేస్తుంటే ‘బెంగాలీ సెక్యులర్ ప్రైడ్’ మమత ఎప్పుడైనా నోరు తెరచి ఒక్క మాట్లాడదు. బమియాన్ బుద్ధవిగ్రహాలను ఫిరంగులతో కూల్చేస్తుంటే సెక్యులరిజానికి నిలువెత్తు విగ్రహమైన సోనియా ఎందుకు తెరవదు. బలూచిస్తాన్‌లో బలూచీలను వేల మందిని ఊచకోస్తున్నా మర్కతీ, ఓవైసీ, బద్రుద్దీన్ అజ్మల్ స్పందించడం మానేసారు. చైనాలో ముస్లింలను తీవ్రంగా అణచేస్తుంటే సీతారాం ఏచూరి, ప్రకాశ్‌కరత్, డి.రాజా నిద్రపోతున్నారా? పాకిస్తాన్‌లో క్రైస్తవులపై అత్యాచారాలు మతమార్పిడి చేస్తుంటే జాన్‌దయాళ్ వంటి శాంతమూర్తి ఏం పనిచేస్తున్నాడు? వీళ్ల కళ్లకు ఇవేవీ కన్పించవు. కేవలం కాశ్మీర్‌ను దోచేసిన అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాలు, పండిట్లను ఊచకోత కోయించిన యాసిన్ మాలిక్ వంటివాళ్ల సెక్యులరిస్టుల దృష్టిలో గొప్పవారు. వాళ్ల దోపిడీ, మత తత్వమే వీళ్లకు గొప్ప లౌకికవాదం. ప్రక్కదేశాల్లో సురక్షితంగా ఉన్న వ్యక్తులు మా దేశంలోకి రావాలని ధర్నాలు చేయడం బహుశా! భారత్‌లో తప్ప ఇంకెక్కడా జరగదు. ఒక్కప్పుడు పాక్‌లో 27 శాతం ఉన్న హిందువులు ఇపుడు 1.5 శాతంగా, బంగ్లాదేశ్‌లో 22 శాతం ఉంటే ప్రస్తుతం 8.4 శాతానికి పడిపోయింది. పాకిస్తాన్‌లో ఒకపుడు 480 మందిరాలుంటే ఇపుడు 20 మిగిలాయి. 1971లో ఆప్ఘనిస్తాన్‌లో 3 లక్షలు జనాభా ఉన్న హిందువులు, సిక్కులు 2017 నాటికి 1350 మాత్రమే ఎందుకయ్యారో ఈ సెక్యులర్ నాయకులు చెప్పరు. సెక్యులరిజం ఈరోజు బూతుపదంగా మార్చింది వీళ్లే. ఈ ముసుగులో ఈ దేశమెజార్టీ ప్రజలను అణచివేత ఇన్నాళ్లూ జరిగింది. క్రీ.శ.712లో భారత్‌లోకి మొదటి దురాక్రమణ చేసిన మహమ్మద్‌బిన్ కాసిం కు ఎంత క్లారిటీ ఉందో, 1946 లో దేశవిభజన చేయించిన జిన్నాకు అంతే క్లారిటీ ఉంది. అలాగే ఓవైసీకి, గులాంనబీకు, ముఫ్తీకి, అబ్దుల్లా అదే లక్ష్యముంది. సెక్యులరిజం ముసుగులో సహకరించే సూడో సెక్యులర్, లిబరల్, అర్బన్ నక్సల్స్ అంతా అంబిరాజు సోదరులే. హద్దులు మీరిన సెక్యులరిజంతో లవకుశలతో ఏర్పడ్డ లాహోర్, కుశి నగరాలు, సింధు నాగరికత, గురునానత్, గురుగోవింద్ స్మారకాలు, ప్రాచీన నాగరికతను కోల్పోయాం. ఇక ఇంకేం కోల్పోతామో!

- డా. పి. భాస్కరయోగి bhaskarayogi.p@gmail.com