భాస్కర వాణి
‘కుతర్కం’ ఇంకెన్నాళ్లు చేస్తారు!?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రెండ్రోజుల క్రితం ‘నిర్బంధ వ్యతిరేక’ సభ ఇందిరాపార్కు వద్ద జరిగింది. అందులో ప్రముఖ విద్యావేత్తగా ప్రకటించుకొన్న డా॥ చుక్కా రామయ్య ‘‘భారత రాజకీయాలు నేడు వ్యక్తి కేంద్రంగా నడుస్తున్నాయని, తమ అధికార సుస్థిరత కోసం కొందరు ‘అర్బన్ నక్సలైట్’ వంటి పదాలను సృష్టిస్తున్నారని.. ఇలాంటివి చూసేందుకే నేను బ్రతికున్నానా?’’ అని అంటూ నిర్వేదం వ్యక్తం చేశారని పత్రికల్లో ప్రముఖ వార్త. ఈ ‘కుతర్కం’ అన్ని కమ్యూనిస్టు వర్గాల్లో కన్పిస్తుంది. అగ్రకుల మేధావులెప్పుడూ సురక్షితంగానే ఉంటారు. వీళ్ల సిద్ధాంత స్వైర విహారానికి క్రింది కులాలవాళ్లను ఎప్పుడూ బలి చేస్తుంటారు. నక్సల్స్ - పీపుల్స్‌వార్- మావోయిస్టుల ఉద్యమాల్లో చనిపోయిన వాళ్ల సంఖ్యను చూస్తే అర్థం అవుతుంది.
ఇదే బ్యాచ్ ‘ట్రంప్ గో బ్యాక్’ అంటూ పోస్టర్లు అతికిస్తారు. వీళ్ల పిల్లల్లో చాలామందిని విదేశాల్లో చదివిస్తారు. వీళ్ల బంధువులంతా జెఎన్టియు, హెచ్‌సియుల్లో ఉద్యోగాలు సంపాదిస్తారు. వీళ్ల కులస్థులంతా పత్రికల్లో ప్రముఖ ఉద్యోగులుగా ఉంటారు. దళిత, బహుజనులను రెచ్చగొట్టి జైళ్లపాలు చేస్తుంటారు. దీనిపై ఎవరైనా రీసెర్చి చేస్తే గణాంకాలతో సహా బయటపెట్టవచ్చు. చుక్కా రామయ్య దత్తాత్రేయ లాంటి భాజపా నాయకుడితో సత్కారాలు పొందుతారు. బాసరకు వెళ్లి వైదిక క్రతువుల్లో పాల్గొంటాడు. ఇక్కడొచ్చి ‘అమిత్ షా, మోదీ దేశద్రోహులు’ అని చెప్పే సిపిఐ నారాయణ ప్రక్కన కొలువుతీరుతాడు. కరడుగట్టిన భాజపా వాది కిషన్‌రెడ్డితో కావలసినపుడల్లా మంతనాలు జరిపే ప్రొఫెసర్ కోదండరాం ‘దేశంలో ప్రజాస్వామ్యం’ లేదని నినదిస్తాడు. నరనరాన జాతీయవాదం జీర్ణించుకున్న సిద్ధేశ్వరానంద భారతి స్వామితో స్నేహం చేస్తూనే నక్సల్స్ చర్చల్లో మధ్యవర్తిగా ఉంటాడు మరో పూర్వ సంపాదకుడు!? ఈ దేశంలో తక్కువ కులాలుగా పిలిచేవాళ్లను ‘నక్సలైట్ ఉద్యమం’ బలి తీసుకుంది. దాని ఫలితాలు మాత్రం ‘గోముఖ వ్యాఘ్రాలు’ పొందుతున్నాయి. ఇపుడు ఈ తీవ్రతలను దళిత, బహుజనులపైకి మళ్లించారు. ఇంకా పదేళ్ల తర్వాత చూస్తే ఇదీ అంతే!
ఇదంతా ఎలా సాధ్యం అని మనలాంటి అమాయకులకు అర్థం కాదు. కానీ వాళ్లకు మాత్రం ఇదో ప్రజాస్వామ్యం. కమ్యూనిస్టు అగ్ర నాయకులది మరో ద్వంద్వ వైఖరి. ‘బూర్జువా, భూస్వామ్యం’ అంటూనే అన్ని బూర్జువా పార్టీలతో జట్టు కట్టగలరు. అలాగే ‘మతోన్మాదం నశించాలి’ అంటూనే ఒక మతం వాళ్లను నెత్తిన ఎత్తుకుని ఊరేగుతారు! ‘ట్రంప్ గో బ్యాక్’ అన్నంత సులభంగా ‘జిన్‌పింగ్’ వస్తే గో బ్యాక్ అనలేరు. కాశ్మీరీ నాయకులకు స్వేచ్ఛ ఉండాలంటారు. పండిట్ల బాధను గురించి పనె్నత్తి మాట్లాడరు. హిందూ ఆచార, సంప్రదాయాలను ఇష్టం వచ్చినట్లు తులనాడుతారు. కానీ ఇతర మతాల్లో వున్న ఒక్క అవలక్షణాన్ని బయటపెట్టేందుకు సాహసం చేయరు. యాకూబ్ మెమెన్‌కు, అఫ్జల్ గురుకు నివాళులు అర్పించి ‘ఆజాదీ’ కావాలంటారు. కానీ కానిస్టేబుల్ రతన్‌లాల్ గురించి ఒక్క మాట మాట్లాడరు. భారత్నుండి అస్సాంను, ఈశాన్య రాష్ట్రాలను వేరు చేద్దాం అని పిలుపునిచ్చే ‘షర్జిల్ ఇమాం’ను వెనకేసుకొస్తారు. ఢిల్లీ అల్లర్లను మొత్తం కపిల్ మిశ్రాను బాధ్యునిగా చేస్తారు. షాహీన్ బాగ్ ఆందోళనను గొప్ప తిరుగుబాటుగా ఫ్రెంచి విప్లవం రేంజ్లో కమ్యూనిస్టు కలర్ ఇస్తుంది. అదే కేరళలో సిఏఏకు మద్దతుగా ర్యాలీ కనీసం వార్తగా కూడా చూపరు!?
కాశ్మీర్లో 370 ఆర్టికల్ ఎత్తేసినందుకు కోపంగా ఢిల్లీని అంతా నిర్బంధం చేయాలనుకున్న శక్తులకు అండగా నిలిచే కుహనా లౌకికవాదులు అదే ఢిల్లీలో మరో వర్గం తిరగబడితే భరించలేకపోతున్నారు. రోజూ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేవారు, అదే ప్రజాస్వామ్య మూలస్తంభమైన పార్లమెంట్ చేసిన చట్టాన్ని గౌరవించవద్దంటారు. వీళ్లకు తర్కం ప్రకారం దేశంలో ఎన్నికైన ప్రభుత్వం కన్నా, తిరుగుబాటే మార్గంగా ఎంచుకొన్నవాళ్లకు ఎక్కువ అధికారాలున్నాయన్న మాట. షహబానో కేసు తర్వాత ఆనాడు రాజీవ్ గాంధీని బయటపెట్టిన శక్తులే ఈనాడు కేంద్రాన్ని భయపెట్టాలని చూస్తున్నాయి. ఇది మనకు కొత్త విషయం ఏం కాదు. మనకు సంబంధంలేని టర్కీ ఖలీఫా గురించి ‘ఖిలాఫత్ ఆందోళన’ జరిగి కేరళలో ఎందరో మెజారిటీ ప్రజలు చంపబడ్డారు. గణాంకాల ప్రకారం మనకు సంబంధం లేని ఖిలాఫత్‌లో మోప్లాలు చేసిన దాడుల్లో 2, 266 మంది చనిపోగా, 1, 615 మంది తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటీష్ రాజ్యం అంతమై, ఖలీఫా రాజ్యం వస్తుందనే విష ప్రచారం ఎందరో ప్రాణాలను బలిగొన్నది. సరిగ్గా సీఏఏపై కూడా ఇలాంటి విష ప్రచారమే సాగుతున్నది. అలాగే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ వాళ్ల గురించి ఈ దేశంలో ఆందోళనలు జరగడం విడ్డూరం. అలాగే ఈ దేశంలో పుట్టిన ఏ ముస్లింకు అన్యాయం జరగదన్న పదే పదే విష ప్రచారం చేస్తూ సాగుతున్న ఈ వ్యతిరేక ఉద్యమం వెనుక అర్బన్ నక్సల్ శక్తులు ఉన్నాయన్నది కఠోర వాస్తవం.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఏసీఆర్, మోదీ ఎవరూ వీళ్లకు నచ్చరు. వీళ్లు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో, ఇందిరాపార్క్ దగ్గరో కూర్చొని ఎలా డిక్టేట్ చేస్తే అలా రాజ్యం నడవాలి!? రాజ్‌దీప్ సర్దేశాయి, బర్భాదత్తా చేసే రిపోర్టింగ్‌ను గమనించి దేశంలో చట్టాలు రావాలి! బృందాకారత్ రాసే ఉత్తరాలకు భయపడి రాజ్యపాలన నడపాలి! కన్హయ్య కుమార్, షెల్హా రశీద్ ఎలా చెప్తే అలా విశ్వవిద్యాలయాలు నడవాలి! ఇదేనా కమ్యూనిస్టులు కోరుకొనే ప్రజాస్వామ్యం!?
నిర్దాక్షిణ్యంగా రోడ్లను బంద్ చేయడం ప్రజాస్వామ్యమా! ఆ రోడ్డుపై వెళ్ళేందుకు ఇతర వర్గాలకు హక్కు లేదా? ఈ విషయంలో సుప్రీంకోర్టు తమ దూతల్ని పంపితే వాళ్లను ఘోరంగా అవమానించడం రాజ్యాంగ స్ఫూర్తా? ఇదంతా గమనించకుండా దేశంలో అందరూ బాగుండాలని చెప్పాల్సింది పోయి దేశంలో విభజన రేఖ గీస్తూ ‘కొందరే శాంతి కాముకులు’ అంటూ ప్రచారం చేయడం దుశ్చర్య కాదా? మోదీ ప్రధాని అయితే ఈ దేశం నుండి వెళ్లిపోతాం అన్నవాళ్లు ఈ దేశమే మాకు పుట్టినిల్లు అంటున్నారు. ఇలాంటి విషబీజాలు నాటే వామపక్ష మేధావులు నిజంగా ఈ దేశ విభజనవాదులు. మణిశంకర్ అయ్యర్ లాంటి వాళ్లను షాహీన్బాగ్కు పంపిస్తూ, ఆ ఆందోళనకు పరోక్షంగా సహకరించిన కాంగ్రెస్ వెంటనే ఏనాడూ వాళ్లను అక్కడి నుండి వెళ్లిపోవాలని ఒక్కరోజూ చెప్పలేదు. కానీ ఢిల్లీలో అల్లర్లు జరిగితే వెంటనే సమావేశం పెట్టి సోనియా మాట్లాడటం, ప్రియాంక శాంతి ర్యాలీ తీయడం విడ్డూరం. దేశంలో ఎవరు తప్పు చేసినా చట్టబద్ధంగా శిక్షించాలని అందరం కోరుకోవాలి. కానీ కొందరిని మాత్రమే శిక్షించాలి అనడం పక్షపాతం కాదా? 1922 ఫిబ్రవరి ఉతరప్రదేశ్ పరగణాల దగ్గర చౌరాచరీలో ఓ పోలీస్ స్టేషన్‌కు నిప్పుపెడితే 21 మంది కానిస్టేబుళ్లు దహనమయ్యారు. ఇపుడు రతన్‌లాల్ అనే అమాయక కానిస్టేబుల్ మతోన్మాదుల చేతిలో హతమయ్యాడు. దీనిపై వామపక్ష రాతలు, కూతలు ‘టెలిగ్రాఫ్’ పత్రిక హెడ్డింగులు చూస్తే అర్థమవుతుంది. ఇంత విషం ఈ దేశ మూలవాసులపై కక్కితే మేం ఎక్కడికి పోవాలి?