అంతర్జాతీయం
నా కుమారుడిని కాల్చి చంపండి..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇస్లామాబాద్: కుటుంబం పరువు తీసిందన్న ఆగ్రహంతో తన కుమార్తె కందీల్ బలోచ్‌ను హతమార్చిన తన కుమారుడు వసీంను కాల్చి చంపేయాలంటూ బలోచ్ తండ్రి అన్వర్ అజీం పేర్కొనడం ఇపుడు పాకిస్తాన్లో కలకలం రేపుతోంది. సోషల్ మీడియా సెలబ్రిటీగా, మోడల్‌గా రాణిస్తున్న బలోచ్ తమ కుటుంబం పరువు తీసిందని ఆమెను సోదరుడు వసీం గొంతు నులిమి ఇటీవల హత్య చేసిన సంగతి తెలిసిందే. పాక్‌లో ఇటువంటి పరువు హత్యలు సర్వసాధారణమే. కుటుంబ సభ్యులు క్షమించినట్లయితే పరువు హత్యల కేసులో నిందితులకు ఎలాంటి శిక్షలు పడకుండా పాక్ చట్టాలు రక్షణ కల్పిస్తున్నాయి. బలోచ్ హత్యపై నిరసనలు వెల్లువెత్తడంతో వసీంను క్షమించరాదని అధికారులు అతని తల్లిదండ్రులను హెచ్చరించారు. బలోచ్‌ను హతమార్చి వసీం చాలా తప్పు చేశాడని అతని తల్లిదండ్రులు చెబుతున్నారు. సంఘటన జరిగిన రోజున తమకు, కుమార్తె బలోచ్‌కు మత్తుమందు కలిపిన పాలను వసీం ఇచ్చాడని అజీమ్ వివరించారు. వేరే గదిలో తాము నిద్రపోతుండగా, మత్తులో ఉన్న బలోచ్‌ను వసీం గొంతు నులిమి చంపాడని తెలిపారు.