బాల భూమి

భాస్కర శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భాస్కర శతకం
---------------
శ్రీగల భాగ్యశాలిఁగడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ
రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను
ద్యోగము చేసి; రత్ననిల యుండని కాదె సమస్త వాహినుల్
సాగరు జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా
భాస్కరా! ఎన్ని ప్రయాసలకోర్చి ఐనను ప్రజలు ధనవంతుని చేరుదురే గాని బీదవాని దగ్గరకు పోరు. నదులన్నియు రత్నములు కలవన్న ఆశతోనే సముద్రుని చేరినట్లుగా.
*
తెలుగు జాతీయాలు
=============
కత్తిమీద సాము
నేల మీద సాము చేయాలంటేనే ఆరోగ్యం, బలం, నేర్పు కావాలి. కత్తి అంచున నిలిచి సాము చేయటం మాటలతో పనికాదు. అలా చేసినవాళ్లున్నారో లేదో తెలియదు. తాళ్ల మీద, తీగల మీద నడిచేవాళ్లున్నారు. కత్తుల్లాంటి మేకులున్న బల్ల మీద పడుకొని బరువు లెత్తించుకుని బతికిన వాళ్లున్నారు. కానీ విచ్చుకత్తి మొన మీద నిలిచి సాము చేసిన వాళ్లున్నట్లు దాఖలా లేదు. అయినా అదొక మహత్తర విద్య. అదెంత భయంకరమో మన ఊహకే అందుతుంది. కళ్లారా చూస్తేగాని నమ్మవలసిన విషయం కాదది. అత్యంత ప్రమాదకరమూ, అసాధ్యమూ అని చెప్పడానికి ఫలానా పని ‘కత్తిమీద సాము’ అంటూంటారు.
ఆషాఢభూతి
నయవంచన చేసే మోసగాణ్ణి ఆషాఢభూతి అని పిలుస్తారు. ఈ రకం మనుషుల సంఖ్య రాజకీయాల్లో ఎక్కువ. ఇతర వృత్తులలో ఉండరనీ కాదు, లేరనీ కాదు. పరద్రవ్యం మీద ఆశలేదని చెప్తూ ధనసంపాదన చేసే మోసగాడు ‘ఆషాఢభూతి’
బాతాల పోశెట్టి
బుడ్డర్‌ఖాన్, తుపాకి రాముడు, విదూషకుడు, నరుకుడుగాడు వీరంతా ఒకటే. ‘బాతాలు’ అంటే మాటలు. హిందీ బాత్ నుండి వచ్చింది. పోశెట్టిగా సాలె వారిని వ్యవహరిస్తారు. బాగా మాటలు నేర్చిన వారిని, విదూషకులను ఇలా పేర్కొంటారు. ఏదైనా సమస్యను ‘నీకేందీ నేను చేస్తానంటూ’ బాతాకాలు కొడుతుంటారు. నమ్మకం లేని మాటలు చెప్పినప్పుడు తెలంగాణలో ఇది ఎక్కువగా వాడుతుంటారు.
*