బాల భూమి

అందరూ మన వాళ్లే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగాపురం అనే గ్రామంలో రామయ్య, సోమయ్య ప్రక్కప్రక్క ఇళ్లల్లో నివసించేవారు. రామయ్య ఉన్నదాంట్లో పది మందికీ పెట్టాలనుకుంటాడు. సోమయ్య పిసినారి. ఏదైనా దొరికినా తనే తినెయ్యాలని చూస్తుంటాడు. అది మంచి పద్ధతి కాదని రామయ్య సోమయ్యకి ఎన్నోసార్లు చెప్పేవాడు. కానీ సోమయ్య వినేవాడు కాదు.
రామయ్యది పాల వ్యాపారం. నీళ్లు కలపని చిక్కటి పాలను సరైన ధరకు అమ్మేవాడు. ‘నీళ్లు కలిపితే నీకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా’ అని సోమయ్య సలహా ఇచ్చినా పట్టించుకునేవాడు కాదు.
మంచి చెబితే వినాలి. చెడు మాటలు ఎవరైనా చెబితే ఈ చెవితో విని ఆ చవితో వదిలెయ్యాలి అనుకుంటాడు మరి.
రామయ్య పెరట్లో జామ చెట్టు ఉంది. దానితో పక్షులన్నీ వాటి మీద వాలుతుండేవి. వాటికి గింజలు కొని తెచ్చి వేసేవాడు. మనతోపాటూ వాటినీ చూసుకోవాలి అనుకునేవాడు. వెనక వైపు ఉన్న అరుగు మీద బుల్లిబుల్లి గినె్నలతో నీరు పెట్టేవాడు. అసలే ఎండాకాలం. మంచి నీళ్లు లేక మనమే అల్లాడిపోతున్నాం. వాటికి దాహం వేస్తే నీళ్లు దొరకకపోతే ఎలా అని ఆలోచించేవాడు.
‘ఎగురుకుంటూ పోయి ఎక్కడో తాగుతాయి. అనవసరంగా నువ్వు డబ్బు ఖర్చు పెడతావు. మానెయ్’ అని సోమయ్య అడగకపోయినా సలహా ఇచ్చేవాడు.
రామయ్య అది విని నవ్వుకునేవాడు.
‘సోమయ్యా! నాకు మళ్లీ ఏదో సాయం చెయ్యాలని నేను ఎవ్వరికీ ఏమీ చెయ్యను. నాకు తోచినది. చేయగలిగినది చేస్తాను. అంతే. అందరూ మనవాళ్లే అనుకుంటూ’ అని సమాధానమిచ్చాడు.
పెంపుడు కుక్క రాజు వచ్చింది. దానిని దగ్గరకు తీసుకుని మెడ నిమిరాడు రామయ్య. అది చిన్నప్పటి నుంచీ అక్కడే పెరిగింది.
ఆ ఇంట్లో పిల్లి, ఎలుక కూడా స్నేహితులులాగే ఉంటాయి. రామయ్య మంచితనమే దానికి కారణం.
అన్నీ కలిసి ఆడుకుంటాయి.
* * *
ఓ రోజు లింగయ్య అనే దొంగ రామయ్య ఇంట్లో దొంగతనం చెయ్యటానికి వచ్చాడు.
రాజూ ఆ విషయం తెలుసుకుని ‘్భభౌ’మని గట్టిగా అరవటం ప్రారంభించింది.
పిల్లి వెళ్లి రామయ్య కాలిని గీకుతూ ‘మ్యావ్! మ్యావ్’ అని అరిచింది.
ఎలుక వెళ్లి దొంగను గట్టిగా కొరికింది.
బాధతో విలవిలలాడిపోయాడు. మత్తుగా పడుకున్నాడు రామయ్య. రాజూ అరుపులు పిల్లి వల్ల ఈ లోపు రామయ్యకి మెలకువ రావటంతో దొంగ పారిపోయాడు.
మరునాడు సోమయ్య ఇంట్లో దూరి నగలు, డబ్బూ అన్నీ దోచుకుపోయాడు దొంగ.
నెత్తిమీద తుండుగుడ్డ వేసుకుని ఏడుస్తున్న సోమయ్యని ఏం జరిగిందని అడిగాడు రామయ్య.
రాత్రి ఇంట్లో దొంగలు పడి నగా, నట్రా అంతా దోచుకుపోయారు అని బాధపడ్డాడు.
‘నిన్న మా ఇంట్లోనూ దొంగతనానికి వచ్చాడు దొంగ. కానీ మా రాజూ, పిల్లి, ఎలుక వల్ల దొంగ పారిపోయాడు’ అంటూ జరిగిందంతా చెప్పాడు.
దానితో సోమయ్యకు తను చేస్తున్న తప్పు ఏమిటో తెలిసి వచ్చింది.
ఒకరికి మేలు చేస్తే మళ్లీ అది ఉపకారం మన దగ్గరకే వస్తుందని అర్థం చేసుకుని అప్పటి నుంచీ అందరితో స్నేహంగా ఉండసాగాడు.
పిసినారితనాన్ని కూడా వదిలిపెట్టేశాడు.

-యలమర్తి అనూరాధ