బాల భూమి

పరాచకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాచకాలు
==========

వదినగారూ మీరు వాసిగలవారు
వండబోయినచోట కుండ నాకేరు!
పరాచకాలు
వదినగారూ మీరు వాసిగలవారు
వండబోయినచోట కుండ నాకేరు!

బావగారూ మీరు ప్రతిభకలవారు
నిండిన సభలోను పిండిబొక్కేరు!

చక్కిలాలాబుట్ట చంకబెట్టుకొని,
సభలోను మా బావ సంగీతపరుడు!

అత్తింటి కోడలూ అలిగి పడుకుంది
అలుకలు తీర్చవే ములుకుల్లకఱ్ఱ!

అట్లుతిని అన్నయ్య అలిగి పడుకుంటే
తిట్లుతిని వదినమ్మ తీపులందింది!

పొద్దోయి పొద్దోయి అన్నయ్య వస్తే,
జల్తారు చీరల్లు కట్టు వదినమ్మ

చింతాకు చక్కన్న చీర చక్కన్న
సిరిదేవి మా వదిన చీర చక్కన్న.

బావా బావా పన్నీరు
బావను పట్టుక తనే్నరు!

వీధివీధి తిప్పేరు
వీశెడు గంధం పూసేరు!
చావడి గుంజకు కట్టేరు
చప్పిడి గుంజకు కట్టేరు
చప్పిడి గుద్దులు గుద్దేరు

అందలము కోరింది కుందనపు కుచ్చు
అతిభోగి కోరాడు అత్తవారిల్లు
పల్లకీ కోరింది పచ్చన్నికుచ్చు
పరదేశి కోరాడు పంచటరుగుల్లు