బాల భూమి

స్వేచ్ఛ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలితో ఇళ్ల చుట్టూ తిరుగుతున్న పిల్లికి తలుపు తెరచి ఉన్న ఇల్లొకటి కనపడింది.
‘అబ్బా...! తాగటానికి ఏదైనా దొరికితే బాగుండును’ అనుకుంటూ ఇంటిలోనికి తొంగి చూసింది పిల్లి. గుంజకి కట్టివేయబడ్డ కుక్క తప్ప ఇంట్లో ఎవ్వరూ కనపడలేదు దానికి. దాంతో ధైర్యంగా వంటింట్లో దూరి గినె్నలో ఉన్న పాలు తాగబోయింది.
అది చూసి వెనక నుండి కుక్క అరవసాగింది. అయినా పిల్లి కుక్క అరుపులు పట్టించుకోకుండా పాలు తాగుతూనే ఉంది. కుక్కకి ఆశ్చర్యం వేసింది పిల్లి ధైర్యానికి.
‘నేనంటే భయం లేదా నీకు? అరుస్తున్నా పట్టించుకోవటం లేదు. నేనెంత బలవంతురాలనో తెలుసా?’ అంది కుక్క.
పిల్లి పాలు తాగుతూనే.. ‘నువ్వు బలమైనదానివే. కాదనను. కానీ నీకంటే బలమైనది నిన్ను బంధించిన తాడు’ అంది.
ఆ మాటతో తల తిరిగిపోయింది కుక్కకి. తాడు వైపు చూసి నిజమే కదా అనుకుంది మనసులో. క్షణంలో దాని శక్తి తగ్గిపోయి అరవటం మానేసి పిల్లికేసి చూడసాగింది కుక్క. ఇంతలో.. ‘అన్ని విధాలా నీకన్నా బలవంతురాలను నేను’ అంది మళ్లీ పిల్లి కుక్కని రెచ్చగొడుతూ.
‘కాదు. నేనే బలవంతురాలను. తాడుతో కట్టివేశారు కాబట్టి నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. లేదంటే నిన్ను ఇప్పటికే చంపేసేదానను’ అంది కుక్క.
పకపకా నవ్వింది పిల్లి.
‘అదే నేను అనేది. నువ్వు నీ రైతుకి బానిసవు. ఆ తాడుకి కట్టుబానిసవు. కట్టు విప్పితేనే తిరగగలవు. రైతు పెడితేనే తాగగలవు. కానీ నేను అలా కాదు. తిరగాల్సినంత దూరం తిరగగలను. కొంచెం కష్టపడితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత తినగలను. నాకు స్వేచ్ఛ ఉంది. నీకు లేదు. ఇప్పుడు చెప్పు ఎవరు బలవంతులో..’ అంది పిల్లి కడుపునిండా పాలు తాగి భారంగా గుమ్మంకేసి కదులుతూ.
‘నీది దొంగ బతుకు. నాకు అలా కాదు. నాకు రైతు అండ ఉంది’ అంది కుక్క ధైర్యాన్ని కూడగట్టుకుంటూ.
‘నీలో శక్తి ఉన్నంత వరకే రైతు అండ. అది లేనినాడు నిన్ను ఒక్కరోజు కూడా రైతు తన దగ్గర ఉంచుకోడు. కావాలంటే వారం రోజులు ఏమీ తినకుండా ఉండు. ఏమి జరుగుతుందో అప్పుడు చూడు.’ అంది పిల్లి బయటికి వెళ్లిపోతూ.
ఆలోచనలో పడింది కుక్క.
ఇంతలో లోపల ఎక్కడో పని చేసుకుంటున్న రైతు వచ్చి ఖాళీగా ఉన్న పాలగినె్నను చూశాడు. అతని కోపం కట్టలు తెంచుకుంది. దాంతో దుడ్డుకర్ర తెచ్చి కుక్కని చావ బాదాడు.
పిల్లి చెప్పింది నిజమేనేమో అనిపించింది కుక్కకు.
ఇక అప్పట్నించీ రైతును మరింత పరీక్షించదలచి ఏది పెట్టినా తినటం మానేసింది కుక్క.
అలా పది రోజులు గడిచేసరికి బాగా నీరసించిపోయి నిలబడలేక పోతున్న కుక్కను చూసి.. రైతు ‘ఈ కుక్కకి ఏదో రోగం వచ్చింది. పిల్లి వచ్చి పాలు తాగుతున్నా పట్టించుకోవటం లేదు. దీనివల్ల ఏ మాత్రం ఉపయోగం లేదు. ఇక ఎక్కువ కాలం బ్రతకకపోవచ్చు. దీనిని ఇప్పుడే వదిలించుకుంటే మేలు’ అని భావించి దానిని తీసుకెళ్లి దూరంగా అడవిలో వదిలేసి వచ్చాడు రైతు.
పిల్లికి మనసులోనే దండం పెట్టుకుని ఆహారం కోసం బయలుదేరింది కుక్క.

-కన్నేగంటి అనసూయ 9246541249