బాల భూమి

దేశం అంచున నిల్చుంటాను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీధిలోనికి జనాలందరూ ఒక్కసారిగా కొవ్వొత్తులు పట్టుకుని గట్టిగా ‘్భరత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా వస్తున్నారు. అది గమనించిన భరత్ ‘ఏమైంది నాన్నా! అందరూ అలా నినాదాలు చేస్తున్నారు’ అని అడిగాడు.
‘ఇటీవల మన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పుల్వామా ఘటనలో 40 మంది సైనికులు వీర మరణం పొందారు. అందుకుని వారిని మనం స్మరించుకోవడానికి అలా ర్యాలీగా బయలుదేరారు. పద మనం కూడా వెళ్లి వద్దాం’ అంటూ తన కుమారుణ్ణి తీసుకుని బయల్దేరాడు రావు.
మరుసటిరోజు భరత్ పాఠశాలకు విద్యాశాఖ అధికారి తనిఖీ చేయడానికి వచ్చారు. ఆయన పిల్లలందరినీ సమావేశపరచి ఎలా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలో వివరిస్తూ ఒక్కో విద్యార్థిని ‘మీరు ఏమవ్వాలనుకొంటున్నారు?’ అని అడగడం ప్రారంభించారు.
భరత్ వంతు రాగానే లేచి నిలబడి ‘సార్! నేను పెద్దయ్యాక మిలిటరీలో చేరుదామనుకుంటున్నాను’ అనగానే, ఆయన వెంటనే ‘ఎందుకలా? డాక్టర్, ఇంజనీర్, యాక్టర్, పోలీసు, కలెక్టర్ ఇలా అనేకం ఉండగా ఇదే ఎందుకు ఎంచుకున్నావ్?’ అడిగారు.
‘సార్! నిన్నటిదాకా నేనూ అలాగే అవ్వాలని అనుకున్నాను. కానీ ఇటీవల మన దేశ జవానులను ఉగ్రవాదులు కాల్చి చంపినప్పుడు, ఒక తండ్రి ఏ మాత్రం బాధపడకుండా నా రెండవ కుమారుణ్ణి కూడా మిలిటరీ లోనికి పంపుతానన్నప్పుడు నాకెందుకో ఇంతకు మించి ఏమైనా అంత తృప్తి కలగదనిపించింది. మనం ఇంత ప్రశాంతంగా ఉండటానికి సరిహద్దుల్లో కాపలాగా ఉన్న మన సైనికులే కదా కారణం. అందుకే ‘నేనూ దేశం అంచున నిల్చుంటాను...’ అనగానే అధికారి భరత్‌ను గట్టిగా హత్తుకొని ‘నీకు నేనిచ్చే బహుమానం ఏమిటో తెలుసా’ అంటూ ఒక సెల్యూట్ చేశారు.
దాంతో అక్కడ వున్న పిల్లలందరి గుండెల్లో ఒకసారి జాతీయ గీతం మారుమ్రోగింది.

-సింగంపల్లి శేష సాయికుమార్ 8639635907