బాల భూమి

సామెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఎండాకాలంలో ఏకులు వడికి వానాకాలంలో వడ్లు దంచినట్లు
* ఎంత పెరిగినా గొర్రెకు బెత్తెడు తోకే
* ఎంత పండినా కూటికే, ఎంత ఉండినా కాటికే
* ఎంత తొండమున్నా దోమ ఏనుగు కాదు
* ఎంత చెట్టుకంత గాలి
* ఎంత పెద్ద ఆబోతైనా పులికి లోకువే
* ఎంత పెద్ద గుమ్మడి అయినా కత్తిపీటకు లోకువే
* ఎద్దుకొద్దీ సేద్యం, సద్ది కొద్దీ పయనం
* నవ్వు నాలుగువిధాల చేటు
* పానకములో పుడక
* పిండికొలది రొట్టె
* పిట్ట కొంచెము కూత ఘనము
* పిల్లికి ఎలుక సాక్ష్యము
* చెప్పేవారికి వినేవారు లోకువ
* పువ్వు పుట్టగానే పరిమళించును
* పెదవి దాటిన పృథ్వి దాటును
* పోరునష్టము పొందు లాభము
* బూడిదలో పోసిన పన్నీరు
* మెరిసేదంతా బంగారము కాదు
* మొరిగే కుక్క కరవదు
* రొట్టె విరిగి నేతిలో పడింది
* రౌతుకొద్ది గుఱ్ఱము
* నిజము దేవుడెరుగు నీరు పల్లమెరుగు
* అప్పుచేసి పప్పుకూడు
* చింత చచ్చినా పులుపు చావదు
* పాము చిన్నదయినా పెద్ద కఱ్ఱతో కొట్టు
* శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు
* అర్ధహీనుని బ్రతుకు వ్యర్థము
* తిన్న ఇంటివాసాలు లెక్క పెట్టినట్లు
* వొట్టిగొడ్డుకు అరుపులెక్కువ
* గోరంత దీపము కొండంత వెలుగు