క్రైమ్/లీగల్

తాళం వేసిన ఇళ్లకు కన్నం పెడుతున్న షికారీ గ్యాంగ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 28 : తాళం వేసిన ఇళ్లకు లక్ష్యంగా చేసుకుని పగలు, రాత్రిళ్లు జిల్లాలో సులువుగా చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట షికారీ గ్యాంగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆదివారం రాత్రి సీసీఎస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ అనంతపురం నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్, ఇటుకలపల్లి, నార్పల, రాప్తాడు పోలీసు స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు నిందితుల ముఠాను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్‌టీఆర్‌టీవీ టవర్ ఏరియాకు చెందిన షికారీ బీరన్న(జున్ను) కుమారుడు షికారి నాగ అలియాస్ ఏల్చా, అనంతపురంలోని బుడ్డప్ప నగర్‌కు చెందిన షికారి గాంధీ కుమారుడు షికారి రామకృష్ణ అలియాస్ బద్రీ, బుడ్డప్పనగర్‌కే చెందిన షికారి పిల్లి గంగులు కుమారుడు షికారి శీన అలియాస్ అర్జునను నగర సమీపంలోని టీవీ టవర్ వద్ద ప్రత్యేక పోలీసు బృందం అరెస్టు చేసి 14 తులాల బంగారు గనలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా నిందితులు పలు కేసులో అనేక మార్లు జైలుకు వెళ్లి వచ్చిన వాళ్లేనని, అయినప్పటికీ వీరిలో మార్పురాలేదని తెలిపారు. తాగుడు, జూదానికి బానిసలైన నిందితులు , తమ వృత్తిలో సంపాదించే డబ్బు జీవనానికి, చెడు అలవాట్లకు సరిపోక పోవడంతో ఇళ్లలో చోరీలు మొదలు పెట్టారన్నారు. చోరులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ప్రత్యేక పోలీసు బృందంలోని సీసీఎస్ డీఎస్పీ ఈ.శ్రీనివాసులు, సీఐలు ఇస్మాయిల్, బీజమోహన్, కే.దేవానంద్, నార్పల ఎస్‌ఐ శ్రీనివాసులు, ఆ స్టేషన్ సిబ్బంది, సీసీఎస్ హెడ్ కానిస్టేబుళ్లు జాకీర్ హుస్సేన్, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు బాషా, భాస్కర్, మల్లికార్జున ఇటుకలపల్లి హెడ్‌కానిస్టేబుల్ నాగన్న, కానిస్టేబుల్ శివప్రసాద్‌ను అభినందించారు.