అనాథ పిల్లల వేటపాలెం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథ పిల్లలు వీధులలో ఎలా బ్రతుకుతున్నారు? వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని సంఘంలో జీవన పోరాటం చేస్తున్నారు? చివరికి వారి భవిష్యత్ నేరమయంగా ఎందుకు మారుతోంది? అనే నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు నంది వెంకటరెడ్డి తెలిపారు. హనీ, ప్రణి ఫిలిమ్స్ పతాకంపై నంది వెంకటరెడ్డి దర్శకత్వంలో ఎవిఆర్ రూపొందించిన ఈ చిత్రంలో ప్రశాంత్, లావణ్య, శిల్ప ప్రధాన తారాగణంగా నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, మంచి మెసేజ్‌ను సమాజానికి అందించాలన్న ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, దండుపాళ్యం చిత్రం గుర్తుకు వస్తుందని, మంచి కథ మనస్సుకు హత్తుకునే సన్నివేశాలు చిత్రంలో ఉన్నాయని, పాటలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: ఎ.ఆర్.సన్నీ, పాటలు: నర్ల రామకృష్ణారెడ్డి, మాటలు: గణేష్ ముత్యాల, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నంది వెంకటరెడ్డి.