S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాధ్యాయ సందోహం

05/15/2019 - 22:22

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*

05/15/2019 - 22:11

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
సుఖకరమైనది, శాశ్వతమైనది అయిన ఆత్మజ్యోతిదర్శనంకొఱకే అది (ఆత్మ) శరీరంలో ఉంచబడింది. నశించే ఇంద్రియాలలో మనసు చాల వేగవంతమైనది. మనస్సుతోకూడిన ఇంద్రియాలు, సమస్త ఇంద్రియాలు జ్ఞాన పూర్వకమైన ఒకేఒక కర్మను లక్ష్యంగా చేసుకొని ఆత్మ అనేక శరీరాలను ఎన్నింటినో పొందుతుంది.

05/07/2019 - 19:31

సహజంగా ఆత్మ జన్మరహితమైనది. శాశ్వతమైనది. అంటే మానవ మరణశీల దేహంలో ఉన్నా అది అమరమైనదే అని ఋగ్వేదం ‘అమర్త్యో మర్త్యేనా స యోనిః’ (ఋ.1-164-38) ‘‘అమృతమైనదైనను మరణ స్వభావం గల ఒక ఉపాధియందు ఆత్మ ఉంటుంది’’అని ఆత్మ స్వరూపాన్ని మరోమారు వర్ణించింది.

05/06/2019 - 18:53

హృదయమంటే- భక్తి (ఇది యోగ పరిభాషలో ఈశ్వర ప్రణిధానం). అట్లే మనస్సు అంటే జ్ఞానం. ఈ రెండింటి సంయోగంచేత సాధకుడికి ‘ఆత్మ’ దర్శనమవుతుంది. కాకపోతే ఈ హృదయ మనఃసంయోగంతోబాటు ఈశ్వర కృప కూడ సిద్ధించినప్పుడే ఆత్మసాక్షాత్కారం సాధ్యమని గ్రహించాలి.

05/05/2019 - 23:10

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
దేవా! సర్వజన హితైషివి కదా! నీవు మాయెడల సుమనస్కుడవుకమ్ము. మాకు మంచి మనసు నిమ్ము.
**
ఆత్మ సాక్షాత్కారం చేసుకో
అయం హోతా ప్రథమః పశ్యతేమమిదం జ్యోతిరమృతం మర్త్యేఘ
అయం స జజ్ఞే ధ్రువ ఆ నిషత్తో- మర్త్వస్తన్వా వర్థమానః॥ ఋ.6-9-4॥

05/02/2019 - 19:18

కర్మ ప్రవీణుడవు. మేము మీకు మంగళాశాసనం పలుకుతాము.తండ్రీ! పుత్రులమైన మేము నీవద్దకు వచ్చే అధికారం మాకు లేదా? మిత్రుడవైన నీవు మమ్ము మోసగిస్తావా? మీ ప్రేమాంకంలో మేమింత స్థానాన్ని పొందలేమా? తల్లీ. తల్లికి మమత్వం, తండ్రీ! తండ్రిలో పుత్రవాత్సల్యం మెండుకదా. అందుచేత
స నః పితేవ సూనవే- గ్నే సూపాయనో భవ సచస్వా నః స్వస్తయే॥ ॥

05/01/2019 - 19:29

సర్వేశ్వరా! మా యెడల సుమనస్కుడవు కమ్ము
భవా నో అగ్నే సుమనా ఉపేతౌ సఖేవ సఖ్యే పితరేవ సాధుః
పురుద్రుహో హి క్షితయో జనానాం ప్రతి ప్రతీచీర్దహతాదరాతీః॥ ॥

04/30/2019 - 18:41

గొప్ప ప్రీతిపాత్రులు. వారికి ఏ హింస సంభవింపనీయరు. పాపాన్ని అంటనీయరు’’. ద్రోహం ఎవరివలన జరుగనీయకుండ చేయడమే పాపంనుండి రక్షించుట. హింస సర్వపాపాలకు మూలకారణం. దైవం తప్ప మనిషిని జీవితంలో ఈ మూల కారణంనుండి ఎవరూ కూడ విముక్తం చేయలేరు. ఈ విషయాన్ని ఋగ్వేదం-
సునీథో ఘా స మర్త్యో యం మరుతో యమర్యమా మిత్రః పాంత్యద్రుహః॥ ఋ.8-46-4॥

04/29/2019 - 23:00

హిందీ మూలం: స్వామీ వేదానంద తీర్థ తెలుగు అనువాదం:
డా పాలకోడేటి జగన్నాథరావు 9490620512
*
సూర్యుని వంటి దివ్యగుణ సంపన్నులారా! మీరు పాపాలను నశింపచేయుట బాగా తెలిసినవారు. పక్షి తన పిల్లలపై రెక్కలను కప్పి ఎలా రక్షిస్తుందో అదే విధంగా మీరూ మాపై రక్ష మరియు ప్రేమలను కప్పి రక్షించండి. మీరు మాపై చూపే రక్ష మరియు ప్రేమలు దోషరహితమైనవి. మీరు చూపే ప్రేమ, రక్షణలే సత్యమైన ప్రేమ, రక్షణలు.

04/29/2019 - 22:59

అంటే దిక్కుతోచని వాడను, మంచి మార్గమేదో తెలియనివాడను, అజ్ఞానాంధకారంలో కూరుకుపోయినవాడను. నా బుద్ధికి తోచినంత మేరకు ధైర్యంగా నిన్ను శరణుజొచ్చుటయే శ్రేయమని నిశ్చయించుకొన్నవాడను అని భావం. కారణమేమంటె-
‘యుష్మానీతో అభయం జ్యోతిరశ్యామ్’ ‘‘నిన్ను ముందుంచుకొని అభయ రూపమైన దివ్యకాంతులను పొందగలను’’. నిన్ను గురిం చి పెద్దల వలన-
త్రీ రోచనా దివ్యా ధారయంత హిరణ్యయాః శుచయో ధారపూతాః

Pages