S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయిన్ ఫీచర్

11/27/2019 - 22:42

కొంతమంది పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా గెంతులు వేస్తుంటే, కొందరేమో నీరసంగా, నిరుత్సాహంగా డల్‌గా ఉంటారు. దీనికి కారణం కొంతవరకూ పెద్దల పెంపకంలో తేడా కావచ్చు. పిల్లల్ని ఒక వయసు వరకూ ప్రేమగా దగ్గరకు తీసుకుని స్పృశిస్తూ ఉంటే పిల్లలకి ఆప్యాయత, రక్షణ, భద్రత ఉండే ఫిలింగ్స్ కలుగుతాయి. దీనివల్ల వారిలో ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది.

11/26/2019 - 22:37

మహాభారతంలో కుంతీదేవి తన సవితి తల్లి బిడ్డలను, తన బిడ్డలను పెంచింది. ఎక్కడా మచ్చలేదు. వారంతా పాండవులుగా కీర్తికెక్కారు కానీ కుంతి తనయులు, మాద్రి బిడ్డలు అన్న వ్యత్యాసం ఎక్కడ మనకు కనిపించదు.

11/24/2019 - 22:31

‘‘ఒక దేశ మహిళ స్థితిగతులను చూసి ఆ దేశ పరిస్థితి ఇట్టే చెప్పవచ్చని’’ అంటారు పండిట్ నెహ్రూ. నిజమే.. ఒక దేశానికి చెందిన మహిళలు ఆ దేశ నాగరికతకు ప్రతిబింబాలు. నేటి సమాజంలో స్ర్తిలు ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో హింసకు గురవుతున్నారు. యూరప్‌లోని డొమినికా రిపబ్లిక్ అనే దేశాన్ని రాఫెల్ ట్రాజిలా పాలించేవాడు. అతని నియంతృత్వ పాలనకు వ్యతిరేకగా మిరాబాల్ సిస్టర్స్ అనే నలుగురు మహిళలు పోరాటం సాగించారు.

11/21/2019 - 22:37

చలికాలం పెరిగిపోయింది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు స్వెటర్, మఫ్లర్‌ల వంటివి వేసుకుంటారు. కాస్త ఆధునికంగా కనిపించాలనుకుంటే జాకెట్, బ్లేజర్, కోట్, షగ్స్.్ర. వంటివి వేసుకుంటారు. కానీ ఎప్పుడూ అవేనా.. అనుకునేవారికి, కాస్త కొత్తగా, ట్రెండీగా.. చలికాలం కోసం ఏమీ తయారుచేయలేదా ఈ డిజైనర్లు.. అనుకునేవారికి కేప్‌లు కాస్త ఊరటనిస్తాయి.

11/20/2019 - 22:57

మనం అనుకున్న రీతిలో జీవితం ముందుకు సాగదు. ఏవో కొన్ని అడ్డంకులు వస్తూనే వుంటాయి. చదువుకునేటప్పుడు కొందరికి కష్టాలు ఎదురైతే, ఉద్యోగంలో సమస్యలు తలెత్తుతాయి మరికొందరికి. సంసార జీవితంలో చిక్కులు మరికొందరివి. ఇలా జీవితంలో ఆశించినవి జరగకుండా ఏవో తెలియని సమస్యలు ఎదురైనపుడు నిరాశా, నిస్పృహలకు గురవటం జరుగుతుంది. నిస్పృహ అనేది ఒక ఎమోషన్. ఇది కోపం, నిరాశలు ఎదురైనప్పుడు ప్రదర్శించే భావోద్వేగం.

11/19/2019 - 23:03

ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం (యూనివర్సల్ చిల్డ్రన్స్ డే) నవంబర్ 20వ తేదీన జరుపుకుంటారు. నేటి బాలలే రేపటి నవసమాజ నిర్మాతలు అనే ఆలోచనతో ఐక్యరాజ్యసమితి 1959లో బాలల హక్కుల ప్రకటన నవంబర్ 20వ తేదీన స్వీకరించడం జరిగింది.

11/18/2019 - 23:37

తరతరాలుగా తరగని సమస్యలలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి మరుగుదొడ్లు లేకపోవడం ఒక తీరని సమస్య. స్ర్తిలే కాదు, పురుషులు, పిల్లలు అంతా కలిపి దేశంలో దాదాపు 73 కోట్లమందికి టాయిలెట్ సౌకర్యం లేనట్లు 2017లో వాటర్ ఎయిడ్ అనే స్వచ్చంద సంస్థ నిర్వహించిన ‘అవుట్ ఆఫ్ ఆర్డర్, ది స్టేట్ ఆఫ్ వరల్డ్ టాయిలెట్’ అనే నివేదిక చెబుతోంది.

11/17/2019 - 22:54

అభివృద్ధి చెందామని గొప్ప సంతోషంతో చెప్పుకుంటాము కానీ అభివృద్ధి పేరుతో జరుగుతున్న అమానవీయ దుశ్చర్యలని చూడలేకపోతున్నాము. తరాలు మధ్య అంతరంగం పెరిగిపోయి చివరికి నిన్నటి యువతరం నేటి వృద్ధులై కొడుకులు చేతా, కోడళ్ళ చేతా, బిడ్డల చేతా ఛీత్కరించబడి బతుకు ఈడుస్తున్నారు.

11/14/2019 - 23:20

ఈ మధ్య ఎవరితో మాట్లాడినా మాటలమధ్యలో టైం లేదనే ఊతపదం విన్పిస్తుంటుంది. నిజమే.. ఉరుకులు పరుగుల జీవితంలో ఎవరికీ టైం సరిపోవడంలేదు. అందనిదాన్ని అందుకోవడం కోసమన్నట్టు ప్రతివారూ పరుగులు పెడుతూ ఆయాసపడుతున్నారు గానీ ఏ ఒక్కరు కూడా నిలకడగా నిల్చుని పరుగు ఎంత వరకు అసరమనేది ఆలోచించడంలేదు.

11/12/2019 - 18:33

చూపుని బట్టి ప్రపంచం కనిపిస్తుంది. పలకరింపుని బట్టి పరిచయాలు పెరిగి స్నేహాలుగా మారడం నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికీ అనుభవంలోకొచ్చే విషయాలే. పిల్లలు తల్లిదండ్రుల కలల పంట. విద్యాబుద్ధులుగా పెరిగిన పిల్లలు తల్లిదండ్రుల ఆనందాన్ని పెంచిన వారవుతారు. క్రమశిక్షణతో ప్రయోజనకారులుగా పెరిగిన వారెవరైనా విలువైన జాతి సంపద.

Pages