S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

08/08/2018 - 18:48

జన్మనా జాయతే శూద్రాః కర్మణా జాయతే ద్విజః అని స్మృతి. పుట్టకతో అందరూ శూద్రులే. నియమనిష్టలతో భోగత్యాగాలు చేసి వేదాధ్యయనము చేయుచూ లౌకిక విషయాసక్తులు కాని వారు ద్విజత్వమును పొందుదురు. బ్రహ్మజ్ఞానము గల ఈ ద్విజలు మిగిలిన వర్ణముల వారికి దిశానిర్దేశము చేయగలరు.

08/07/2018 - 19:30

హనుమంతుడు తన మాటల చాతుర్యంతో శ్రీరాముడిని మొదటి చూపులోనే ఆకట్టుకున్నాడు. అందరిచేత హనుమంతుడు ప్రశంసించబడ్డాడు. భయపడుతున్న సుగ్రీవునికి తన మాటలతో చేతలతో భయాన్ని దూరం చేశాడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోక సుఖలాలసతో మునిగిన సుగ్రీవుని కూడా హనుమంతుడే తన మాటల చేత కర్తవ్యపాలనకు నిలబడేట్టు చేశాడు. దుర్భర వేదనలో ఉన్న సీతమ్మకు తన మాటల చేత ప్రియం కల్గించాడు.

08/05/2018 - 21:21

క్రీ.పూ.మూడువేల ప్రాంతం నాటి మహాభారత శాంతి పర్వంలో భృగు భరద్వాజుల సంవాదంలో వృక్షాలకు ప్రాణం వుందనీ, పంచేంద్రియలు కూడా పనిచేస్తాయనీ చెప్పబడింది.
ఆకులు, బెరళ్ళు, పూలు, పళ్ళు కూడా వేడికి వాడిపోతున్నాయి. క్రమంగా రాలిపోతున్నాయి. కనుక చెట్లకు స్పర్శజ్ఞానం వుంది.

08/03/2018 - 19:18

1000 బి.సి ప్రాంతపు సుశ్రుతుడు వెంట్రుకలను నిలువుగా చీల్చగల కత్తులను తయారుచేయు విధానాలను, వివరంగా వర్ణించాడు.
నూనం మమాంగాన్యచరా దనార్యః శస్రె్తైస్సితైః ఛేత్స్యతి రాక్షసేంద్రః
తస్మిన్ననాగచ్చతి లోకనాథే గర్భస్థజంతో రివ శల్యకృంతః॥

08/02/2018 - 18:55

ఈ 1600 ఏళ్ళలోనూ ఈ పూత మందం 50 మైక్రాల్‌కు పెరిగిందట! ఈనాడు మిసావైట్ అని పిలవబడే ఈ పూత వజ్ర లేపనాలలో ఒకటి అయి వుండవచ్చు.
అలాగే ప్రస్తుతం బ్రిటీష్ మ్యూజియంలో ఒక బుద్ధ విగ్రహం వుంది. అది బీహారులో లభ్యమైంది. 4వ శతాబ్దానికి చెందిన ఈ రాగి విగ్రహం ఒక టన్ను బరువు, 2.1 మీటర్ల ఎత్తు వుంది. అది కూడా ఈనాటివరకూ చెక్కు చెదరలేదు.

08/02/2018 - 18:45

శ్లో అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా
ఆప్నువన్ పూర్వమర్షత్
తద్దానతో అన్యానత్యేతినిష్ఠ
తస్మిన్నపో మాతరిశ్వాదాధాతి
(ఈశావాస్యోపనిషత్తు శ్లో. - 4)

శ్లో తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే
తదన్తరస్య సర్వస్యతద్దూ సర్వస్యాన్యబాహ్యతః
(ఈశా.ఉప. శ్లో. - 5)

07/31/2018 - 19:29

గణిత శాస్త్రం అంటే కేవలం అంకెలు కాదు! దాంతోపాటు అనేకానేక అంశాలు ఉంటాయి. అంక గణితం, బీజగణితం, రేఖా గణితం, జ్యామితి, త్రికోణమితి, గోళ గణితం వగైరాలు అన్నీ ఈ కోవలోకి చేరినవే. అలాగే లోహశాస్త్రం అంటే కేవలం ఇనుము గురించిన శాస్త్రం అని అనుకోవటానికి వీలు లేదు. దాంతోపాటు ఖనిజ శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైమానిక శాస్త్రం, యంత్ర శాస్త్రం (మెకానికల్ ఇంజనీరింగ్) వగైరాలన్నీ కలిసి వుంటాయి.

07/29/2018 - 22:26

మా కులదైవం, మా ఇష్టదైవం కలియుగ వేంకటేశ్వరుడు. ఆ వేంకటేశ్వరుని దయామృతాన్ని గ్రోలడానికి అనునిత్యం మా దంపతులం వేంకటేశ్వరుని పూజిస్తుంటాం. ఆ వేంకటేశ్వరుని కొలవడానికి చిన్న పూజాగదిని కూడా మేము మా ఇంట్లోనే నిర్మించుకున్నాం. ఆ వివరాలను చూడండి.

07/29/2018 - 22:21

తం చికీర్షుః శరది గిరి సానుజం శుచిరుపోష్య
ప్రశస్తే‚ హని ప్రశస్త దేశజాతం అనుపహతం
మధ్యమవయసం మహాంతం అసిత ముష్కక
మధివాస్య అపరేద్యుః పాటయిత్వా
ఖండశః ప్రకల్ప్య అవపాట్య నిర్వాతే దేశే
నిచితం కృత్వా సుధాశర్కరాశ్చ ప్రక్షిప్య
తిలనాళైః అదీపయేత్‌
అథ ఉపశాంతే అగ్నౌ తద్భస్మ
పృథక్ గృహ్ణీయాత్ భస్మ శర్కరాశ్చ
తతః క్షార ద్రోణం ఉదకద్రోణైః

07/22/2018 - 21:10

హైదరాబాదులోని గోలకొండ కోట వంటి కోటలు శబ్దతరంగ ప్రసార విజ్ఞానాన్ని వినియోగించుకుని, ఆనాటి రాజభవన నిర్మాణాన్ని వారెలా నిర్వహించారో ఇప్పటికీ మనకు కనిపిస్తూనే వుంది. కొండ కింద చప్పట్లు కొడితే, కొండమీద రాజభవనంలో ఆ చప్పట్లు ప్రతిధ్వనించటం ఈనాటికీ మనకు కనిపిస్తోంది.

Pages