S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

07/08/2018 - 21:48

భూమి వయస్సు
మనం నివశిస్తున్న ఈ భూమి వయస్సెంత?
ఈ ప్రశ్నకు సమాధానం చెప్పుకోవాలంటే, మనం పూర్వం చెప్పుకొన్న కొన్ని విషయాలను పునరుక్తి చేయక తప్పదు. ఐనా వీలైనంత తక్కువ పునరుక్తితో మనం ముందుకు సాగుదాం.
భూమి వయస్సును ఆధునిక శాస్తజ్ఞ్రులు సుమారుగా 200 కోట్ల సంవత్సరాలు అని చెబుతున్నారు.

07/01/2018 - 21:56

గోళము యొక్క ఘన పరిమాణానికి సూత్రం-
= 4/3x నిన్గి3
కనుక భూ ఘన పరిమాణము= 4/3x 22/7 x 500 x 500 x 500
= యాభై రెండు కోట్ల ముప్ఫై ఎనిమిది లక్షల తొమ్మిది వేల అయిదు వందల ఇరవైమూడు చిల్లర ఘన యోజనాలు! భూమి పూర్తిగా గోళాకారంగాకాక ధ్రువాల దగ్గర నొక్కుకుని వుంది. కనుక, దీన్ని దగ్గర అంకెకు రౌండు చేస్తే భూ ఘన పరిమాణం యాభై కోట్ల యోజనాలని చెప్పటం సముచితమే గదా!

06/29/2018 - 21:20

వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట విన్నారు కదా! (యేసు) నేను మీతో చెప్పునదేమనగా ఒక స్ర్తిని మోహపు చూపులతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. -మత్తయి 5:27-28

06/29/2018 - 21:22

3 నిమేషములు- 1 క్షణము (ఇందు 3న16,200= 48,600 పరమాణువుల కాలము గలదు)
5 క్షణములు - 1 కాష్ఠ (ఇందు 5న48,600 = 2,43,000 పరమాణువుల కాలము గలదు)
1 కాష్ఠ కాలములో - 3న5 = 15 నిమేషమలు గలవు
15 నిమేషములు - 1 కాష్ఠ
30 కాష్ఠలు - 1 కళ
30 కళలు - 1 ముహూర్తము
30 ముహూర్తములు - 1 దివారాత్రము = 24 గంటలు
24 గంటలు = నిమేషములు 15న30న30న30
= సెకండ్లు 24న60న60

06/28/2018 - 21:15

సృష్టిలో ఖాళి ప్రదేశమనేది లేదు. మొత్తమంతా శక్తితో నిండి వుంది. అమెరికాకు చెందిన శాస్తవ్రేత్త జాన్ ఎఫ్ వీలర్ అనే ఆయన విశ్వాన్ని గురించి ఏమన్నాడంటే ‘మనం శూన్యమని అనుకునేదంతా అత్యంత భయంకరమైన భౌతిక శాస్త్రానికి నిలయం-యథార్థమే కదా! సత్యమేమంటే, విశ్వంలో (సృష్టిలో) ప్రతి అణువులోను, ప్రతిమూలా నిరంతరం ఏదో ఒక మార్పు జరుగుతూనే వుంది. అంటే చైతన్యం స్పందిస్తోంది, నర్తిస్తోంది. అదే నటరాజ నృత్యం.

06/28/2018 - 21:11

సాయణుడు ఉదహరించిన శ్లోకం కొద్ది మార్పులతో సాంబపురాణంలో కూడా కనిపిస్తోంది. దానిలో 20వ అధ్యాయంలో ఇరవయ్యవ శ్లోకం ఇలా వుంది.
యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే
ఏకేన నిమిషార్ధేన దివి సూర్యః ప్రసర్పతి
(ఆకాశంలో సూర్యుడు అర్ధ నిమిషానికి 2202 యోజనాల వేగంతో సాగుతున్నాడ) అని.

07/08/2018 - 21:48

దీని అర్థాన్ని పట్టిక రూపంలో తెలుసుకుందాం
విష్ణుపురాణంలోని కాలగణనం ప్రకారం ఒక దివ్య సంవత్సరం- అంటే 360 మానవ సంవత్సరాలు- అనగా 12000న360 = 43,20,000 మానవ వత్సరాలు. ఇది ఒక చతుర్యుగము, చతుర్యుగి లేదా మహాయుగము.

06/26/2018 - 21:16

తోక కూడా దొరకటం లేదు! పోనీలే ఈ నాడు కాకపోతే మరో పదేళ్ల తర్వాతైనా శాస్ర్తియ విజ్ఞానం అభివృద్ధి చెంది- ‘‘ఖగోళం’’లోని గ్రహగోళాలు అన్నింటినీ లెక్కప్రకారం ‘‘సర్వే’’చేసి తెలుసుకోగలం- అని అనుకుందాం అనుకుంటే-

06/25/2018 - 21:43

అందుకే వారాలను మన మహర్షులు గ్రహాల పేర్లతోనే పిలిచారు. ఐతే వారాల వరస నిర్ణయించటంలో మన మహర్షులు అనుసరించిన లాజిక్ కేవలం గ్రహగోళాలమీద ఆధారపడి లేదు. అది గ్రహదేవతల తత్త్వాలమీద కూడా ఆధారపడి వుంది.

06/24/2018 - 21:28

ఎందుకనుకోవాలంటే- సూర్యుడి ఆధిపత్యంలో సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న గడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. దీనే్న మరో రకంగా తిప్పి చెప్పుకుంటే, సృష్టి ప్రారంభ కాలంలో ఏ గ్రహం ప్రభావం అమలులో వుందో, ఆ గ్రహం పేరే- ఆదిత్యుడు, అనగా మొదటివాడు. అదే మొదటిరోజు! అందువల్ల ఆ రోజు ఆదివారము అవుతుంది. ఆదివారమన్నా ఆదిత్యవారమన్నా ఒకటే.

Pages