S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

10/15/2019 - 18:33

పరుగిడుతున్న యువ చైతన్యం
చెప్పాచెయ్యకుండా చేయి జారిపోతుంటే
పెద్దరికం మీదికొచ్చి
‘‘కలత ఎరుగని లేత ప్రాయపు
తలిరుటెడదను తీగ నారిన
చెలిమి జ్ఞప్తికి వచ్చి కన్నులు
చెమ్మగిలిపోవున్’’
లొంగిన ఆకర్షణలు దూరంగా జరిగి
ఊపిరి ఆలాపన సాగిపోతుంటే
ఉనికి పై ఉపరితల ద్రోణి ఏర్పడి
‘‘బ్రతుకు పై విసుగెత్తి నెమ్మది
చితుకు మంటగ నుండ స్వప్నము

10/14/2019 - 19:37

పొదరిళ్ళు ఎదలు విప్పుకున్న పొలుసులన్నీ
తోటమీద పడి ఆడుకుంటున్న తొందరలే...
నాకెందుకో
కాలం కనురెప్పలమాటు కనికరంగా
కలల్ని కదిలించినట్లుంది
కాలం తిరిగి తిరిగి
జీవితాన్ని- తరాల
తరంగాల కందిస్తూన్న విధిగానే కనిపించింది
నాకెందుకో
కాలం తామరాకు మీద నీటి బిందువుగానే
కనిపిస్తోంది
పరిసరాల రంగుల కలబోతలన్నీ కూడా...
***

10/13/2019 - 22:10

కొమ్మమీద వాలిన పక్షీలేదు
కొమ్మరాల్చిన పువ్వూలేదు
ప్రతి వస్తువు వ్యక్తిత్వాన్ని కోల్పోయి మసలుతున్న
ఈ చిత్రంలో
సమస్త మానవకోటి సృష్టిస్థితికి మూలమైన
ఏకైక చిహ్నం-
మనిషి మాత్రం అర్థం మిగలని అక్షరమయ్యాడు
జీవితం రాలుస్తున్న క్షణాలలోపడి
జీవన కోలాహలం చప్పరిస్తున్నాడు..
***
మట్టిలో నిద్రిస్తున్న కలల గంధాన్ని వెలికి తెచ్చే
ఒకానొక

10/13/2019 - 22:06

బట్టలు కుట్టేవాడు

10/10/2019 - 19:31

చూస్తూ చూస్తూ కాలిన ఆకాశం క్రింద
కాళ్ళు తెగిన ఒంటెలా..
వయసు మళ్లిన ఈవిడెవరో
ఒంటిమీద వసంతాన్ని పులుముకొంటూ...
అప్పుడు నన్ను పుష్పించిన తల్లి
ఇప్పుడు స్వప్నధూపంలో కూడా
సాక్షాత్కరించదు
ఆత్మ శిక్ష పొందిన వాణ్ణి కనుక
అక్షర పూజ చేశారు. అంతరంగాన్నలం కరించుకున్నాను
ఆద్యంతములు లేని యంభోదమువని
జగమే మహాంబోధి జన్మమొందు

10/09/2019 - 18:32

ఊపిరాడక చచ్చిపోతుంది
నీలిదీవుల్లో
పూల మబ్బులు కదలటం చూసి
పరిమళాల పసిగాలుల్ని ఱెక్కలలో నిమురుతూ
ఒళ్లురిచి ఓనెమలి
పింఛాన్ని ఓరగా ఆరవేసుకుందంటే
తక్షణం ప్రచాలాకి ప్రజాస్వామ్యానికి
పంక్తి భోజనవౌతుంది
మైలపడిందో లేదో కాని మనుజ జన్మ
అందమును హత్యచేసెడి హంతకుడు మాత్రం
బుద్ధదేవుని భూమిలోనే పుట్టాడు
అమావాస్యని పూచిన ఆకాశం

10/07/2019 - 19:06

తప్పనిసరిగా మరుచివ్వలో మార్పు
పసి ప్రభాత క్షతజాన్ని
పచ్చివెచ్చగా స్రావం చేసుకుంటోంది
సర్వతోముఖంలో సగమైన
వరారోహ భవిత
తూగుతున్న వాహనంలో జోగుతోంది
పిల్లనగ్రోవిలాంటి వాక్యం ఫెళ్ళున విరిగింది
శయ్యతో పెట్టుకున్న తర్కంతో
కోల్పోయిన కలలకు దేహ తారుణ్యాన్ని బలిపెట్టినట్లు
పిల్లనగ్రోవి లాంటి వాక్యం ఫెళ్ళున విరిగింది

,
10/06/2019 - 21:51

శిరిడిలో అలనాడు సాయిబాబా చుట్టూ ఎంతో మంది ఉండేవారు. వారంతా ఆయన భక్తులు. కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా కూడా ఉండేవాళ్లు. వాళ్లు ఆయన్ను చూస్తూ బాబా చేసేపనులను పరీక్షిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు వాడవాడలా శిరిడీ నాథుని గుళ్లు కోకొల్లలుగా ఉన్నాయి. చాలామంది సాయినాథుని భక్తులుగా ఉంటున్నారు. వారంతా ప్రతి గురువారం సాయి బాబా గుడికి వెళ్తుంటారు.

10/06/2019 - 21:48

సీ. తలచిన వారలుఁ బిచి నంతట ఁ బల్కు
కలిమి బలముల బంగారు దుర్గ
దారిద్య్ర నాశినీ దయగల మాతల్లి
యమృత వర్షిణి వి నేవమ్మా దుర్గ

నమ్మిన వారికి నవవిధులొసగంగఁ
దలుపుఁ దట్టెద వీవు తల్లి దుర్గ
చింతలెన్ని యునున్నఁ జిడికెలో ఁ జలార్పఁ
గదలి వచ్చెడి తల్లి కనక దుర్గ

10/06/2019 - 21:45

గ్రహ, శత్రు, అపమృతు దోష నివారణ కోసం చేసేవారు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది.

Pages