S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/17/2019 - 22:09

అనగానే అక్కజమున వారు మునిగిపోయిరి
ఎప్పుడెట్టుల తేరుకొనిరొ ప్రశ్నల వర్షించిరి

కృష్ణపత్నులు
అది ఏమిటి విడ్డూరం మా సత్యే సీతయనుట?
అది ఏమిటి మీరెట్టుల రాముండా నాడు?

అష్టకష్టములను ఓడిన సీతమ్మోరెక్కడ?
అష్టైశ్వర్యాలదేలు సత్యభామ ఎక్కడ?

సతి నొక్కతెనేలుకున్నశ్రీరాముండెక్కడ?
వేనవేల కనె్నబ్రతుకులేలిన మీరెక్కడ?

02/17/2019 - 21:59

రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా..
*

02/15/2019 - 19:30

నా ప్రాణమె నన్నువీడి మరల కలిసినట్లు నన్ను
నన్నమరుని చేసెనోయి నారుక్మిణి నన్ను

తనకొంగున ఇనుని ధాత్రి ముడివేసిన రీతిని
నను సిగలో పూవువోలె ముడుచుకొనియె సత్య

ఒక మేఘం పైట జార్చినను బానిస చేసెను
ఒక చేడియ వీణియయై నన్ను కవుగిలించెను

ఒక తారక కన్నుగిలిపి నాపై వలవేసెను
ఒక కెరటం వలయమ్మై నన్ను చుట్టుముట్టెను

02/14/2019 - 19:44

మీ వనె్నల జాబిలిలో గంతులేయు కుందేటిని
మీ చినె్నల తోటలల తిరుగాడెడి తేటిని

ఈ ఒప్పుల కుప్పలపై రాలిన నెమలీకని
మీ కటారి చూపులందు నలిగిన పూరేకుని

మీ నవ్వుల రాలినట్టి పువ్వు లేరుకొంటిని
మీ కన్నుల జాలువారు రవ్వలేరుకొంటిని

మీ నడకల కులుకులందు తళుకులేరుకొంటిని
మీ కౌగిలిలోన కరిగి కర్పూరమ్మైతిని

02/13/2019 - 20:02

ఇంత వశీకరణ మెచట కొని తెచ్చితివోరుూ?
ఇంత రసిక శిఖామణివి నోరు కదపవేమోయి?

నడిచినచో నడుచుమేర తొణికిసలాడును అందం
ఒలికిపోవు సోయగాలె సృష్టికి మూలమ్ములనగ

పరుగెత్తిన వెనకపడును కాలప్రవాహమ్మే
దారులందు జారిపడిన చిరుమువ్వల నేరుకొనగ

నిలిచినచో నిలిచిపోవు నిఖిల ప్రపంచమ్మే
నిలువెత్తున నిన్ను కొలిచి నీకంజలి ఘటింపగ

02/13/2019 - 20:00

భారత దేశ నాగరికతకు మతము జీవకర్ర వంటిది. మతత్రయాచార్యులలో, వైష్ణవమత బోధకులలో అగ్రగణ్యులైన శ్రీమధ్వాచార్యులు ఒకరు. త్రిమతాచార్యులలో మూడవ వారై, హనుమంతుడు, భీముడు, అనంతరం వాయుదేవునకు తృతీయ అవతారంగా భావించే మధ్వాచార్యులు ద్వైత మత బోధకులు. ఆయన సాంప్రదాయాలను పాటించే వారిని మాధ్యులు లేదా మధ్వమతస్తులు అంటారు.

02/12/2019 - 18:58

కృష్ణపత్నులు:
ఎంత అందమోయి నీది? ఎంత అందగాడవోయి?
ఎంత మధుర మోయి మోవి? ఎంత మధుర మోయి?

ఈ అందం, ఈ చందం నీకెక్కడివోయి?
ఈ కన్నుల సోయగాలు ఏ తారలవోయి?

నీలి నీలి దేహమ్మున సాగరమ్మె పొంగినట్లు
నీలి నీలి కురులలోన జలపాతము లీదినట్లు

చెక్కిలిలో లెక్కలేని చుక్కలు కలహించినట్లు
నవ్విన పడు సొట్టలందు నదులు సుడులు తిరిగినట్లు

02/12/2019 - 18:56

లోకులు ఏమనుకుందురో యను భీతిచే, డంబముకొఱకు కర్మకలాపములను నిర్వహించువాడుగాని, దానధర్మములను జేయువాడు గాని పారమార్థికుడనదగడు. నిశ్శబ్దముగను ఏకాంతముగను ఆచరింపబడు ధర్మమే ధర్మము. అదియే పరమార్థము. డంబము, ఆడంబరము సాగుచోట నున్నదంతయు బూటకమే.
ఒండొరులతో సాధకుల చుట్టఱికము
254. పారమార్థికులగువారు సమస్త సంఘాచారములకును అతీతమగు జాతిలోనివారు, అదియే వారికి స్వీయమైన జాతి.

02/11/2019 - 20:07

ఒకతె వేదమర్మ మరయు ఒకతె ప్రణయ సమాగమము
ఒకతె జీవనధ్యేయము- ఒకతె విశ్వరహస్యమ్ము

అవధానమ్మను ప్రక్రియ కతడే ఆద్యుండయ్యెను
వారలడుగు కోరికలను వారించక ఈడేర్చెను.

పూవువలె నొక్కతెను పులకింపగాజేసె
పామువలె నొకదాని పెనగ వేసె

పాటయై నొకదాని అధరమ్ముపైనాడె
పక్షియై నొకపడతి కుక్షివ్రాలె

లేడివలె నొకపడతి వెంట దవ్వుల నేగె
తేటియై పూబోణి గుండె దూరె

02/11/2019 - 22:39

ప్రజలును సుమదళములైరి ప్రభువును తులసీదళం
అంజలించె ద్వారకయే- అతడంజలి మునిగెను

ద్వారక గగనమ్మాయెను- కృష్ణుడు చంద్రుడాయెను
చంద్రునుండి విడనోపని- సత్య వెనె్నలాయెను

తానన్నది మిగులబోక- నిశే్చషమ్మై పోయెను
కృష్ణునిలో కరిగి సత్య కృష్ణుండై పోయెను

వన విహారం
ఆ దినమున అతని సతులు అతని వీడలేకుండిరి
అతని వెంట గ్రహములట్లు అతివలంత తిరిగిరి

Pages