S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

Others

02/08/2019 - 18:36

ఆ ద్వారక నొకదినమున ఆయెనొక్క విశేషమ్ము
అది తెలిసిన మానసమ్ము వికసిత కమలమ్ము

ఎంచినాడు శ్రీకృష్ణుడు సత్యభామ తీరు మార్చ
ఎరిగినాడు నారదుండు ఆతని మదిలోని మాట

పుణ్యకవ్రతమను వ్రతమ్ము సలుపుమనుచు తెలిపెను
మేఘమ్ములు తుహినమ్ముల వోలె నగవులొలికెను

మునిమాటను తలదాల్చుచు ముదిత సల్పె వ్రతము
తన నాథుని, సనాతనుని తన్వి దానమిడెను

02/07/2019 - 19:10

చందమామలట్లు వెలుగునందలి సౌధమ్ములు
అందందున తళుకులీను అతివలె తారకలు

ఉవ్వెత్తున లేచి పడెడు ఒక పచ్చని సంద్రమట్లు
అప్పురమున వనములెల్ల నబ్బురమ్ము గొల్పును

సత్యభామ జడలట్టుల నర్తించును వల్లరులు
రుక్మిణమ్మ పూజలకై పోటీపడి పూయును

అతడే మా కృష్ణుడంచు అతడే మా విష్ణువంచు
అప్పురమే కప్పురమై ఆరతి అతని వ్రోల

02/06/2019 - 20:05

ద్వారక
అది ద్వారకనగరమ్ము - అది ద్వాపర యుగాంతమ్ము
అలల లోన కలల తోడ - వెలసెనొక్క ద్వీపమ్ము

నగరమ్మే సాగరమన -అగుపించును ద్వారక
ఉరకల పరుగుల దేలెడు - నరులె తరంగాలనంగ

రత్నాకరు గర్భమ్మున -రత్న గర్భ ద్వారక
రతనాలకె వెలుగు నిడుచు - రాజ్యమేలు శ్రీకృష్ణుడు

ఒక సూర్యుడు తన వక్షం చీల్చి వెలుగునిచ్చునట్లు
ఒక అంబుధి తన రక్తం తోడ జగతి బ్రోచునట్లు

02/05/2019 - 19:46

శ్రీమాన్ గన్ను కృష్ణమూర్తిగారు చతుర్భుజులు..
పంచముఖులు.. బహుగ్రంథపఠనం,
నవ్యరచనా ధౌరంధర్యం, ప్రాచీన వాఙ్మయ రహస్య
మూల్యాంకన చణత్వం, విద్వజ్జన శ్లాఘావశీకరణం..
ఇవి ఆయన చతుర్భుజత్వాలు. అంతేకాదు ఆయన భావుకుడు,
మంచి విమర్శకుడు, ఉపన్యాసకుడు, కవి, తాత్త్వికుడు..
ఇలా ఎన్నో.. ‘కవిత్వం.. తీరని దాహం’

02/03/2019 - 22:31

ప్రశ్న. ఏకలవ్యుని కులం మరియు కుటుంబం యొక్క నేపథ్యం కాకుండా ఇతర బలమైన కారణాలు ఏమైనా ద్రోణాచార్యులకు ఉన్నాయా?

02/03/2019 - 22:27

దేవతలచేత ప్రశంసింపబడిన స్వామి తాను తన ప్రభువును ప్రశంసిస్తున్నాడు. అందుకే-
ఏవం సీతాం తదా దృష్ట్య్వా హృష్టః పవన సంభవః
జగామ మనసా రామం ప్రశశంస చ తం ప్రభుమ్
పవన సంభవుడైన స్వామి సీతాదర్శనాన్ని చేసికొన్నాడు. ఆనందాన్ని పొందేడు. ఉపాసకునకు ఉపాస్య దేవతా దర్శనమైంది. వెంటనే మనో లక్షణంతో రామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళేడు. ఇటువంటి భార్యను పొందినందుకు ఆయనను ప్రశంసించేడు.

01/31/2019 - 19:34

శ్రీచక్రము-మానవశరీరము
ప్రతులకు:
H.No. 7-8-51, Plot No. . 18, నాగార్జున సాగర్‌రోడ్, సెంట్రల్ కాలనీ ఫేజ్ -2, హస్తినాపురం, హైదరాబాద్- 500079
===============================================================

01/30/2019 - 18:39

సందిగ్ధమైన స్మృతిలా ఉన్నదట. స్మృతులంటే మన్వాదిస్మృతులు. అందువలన నిపతితమైన బుద్ధిలా ఉన్నదట. ఆ తల్లి స్మృతిరూపమే. కాని రుూ రూపంలో ఆ లక్షణం కప్పబడింది. శ్రద్ధ అంటే అస్తిక్యబుద్ధి. అది విహతమైంది. అవిశ్వాస బహుళమైన శ్రద్ధ వలన ఆశ ప్రతిహతమవుతున్నది. ఆమె శ్రద్ధా స్వరూపం. కాని రుూ పొర అడ్డుపడ్డది.

01/29/2019 - 19:42

మూలాధారే ధరాబీజం తద్బిందౌ బ్రహ్మణస్థితః
తదంకే శిశు రూపస్య గజా రూఢో మారాధిపః
మూలాధారము భూమి (లం) బీజముగా కలది. ఆ బిందువులో బ్రహ్మ అధిష్ఠించి ఉంటాడు. ఆయన సమీపంలో ఐరావతము నెక్కి శిశు రూపంలో ఇంద్రుడు ఉంటాడు. ఆ ఇంద్రుడామెకు నిత్యము పాయసాన్నమును సమర్పిస్తూ ఉంటాడు. ఇంద్రునిచే సమర్పింపబడిన పాయసాన్నము ఆ తల్లికి ఇష్టము. అందుకని పాయసాన్న ప్రియా అని అమ్మవారి నామము. ఇది యోగ సంప్రదాయము.

01/28/2019 - 19:07

మంద ప్రఖ్యాయమానేన రూపేణ రుచిర ప్రభాం.
పినద్ధాం ధూమజాలేన శిఖామివ విభావసోః
పీతే నైకేన సంవీతాం క్లిష్టేనోత్తమ వాససా
సపంకామనలం కారాం విపద్మామివ పద్మినీం
వ్రీళితాం దుఃఖ సంతప్తాం పరిమ్లానాం తపస్వినీం
గ్రహేణాంగారకేణేవ పీడితా మివ రోహిణీమ్.

Pages