S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/04/2016 - 17:06

అమలాపురం : ఒక్కగానొక్క కుమారుడు తల్లిని శ్మశానంలో వదిలేసి వెళ్లిన ఘటన అమలాపురంలో గురువారం ఉదయం వెలుగుచూసింది. పేరూరులో ఉప్పు సత్యవతి(80) గుడిసెలో ఉంటోంది. ఈమె కుమారుడు హనుమంతరావు రాజమహేంద్రవరంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కదల్లేని స్థితిలో ఉన్న తల్లిని బుధవారం హనుమంతరావు రాజమహేంద్రవరం తీసుకెళ్లాడు. అత్త సత్యవతి పోషణ భారం తీసుకునేందుకు హనుమంతరావు భార్య నిరాకరించింది.

08/04/2016 - 16:59

విశాఖ: విశాఖ జిల్లా రోలుగుంటలో గురువారం తరలించడానికి సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలించడానికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

08/04/2016 - 15:41

విజయవాడ: జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, ఏకీకృత పన్ను విధానం అటు దేశానికి, ఇటు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.4,700కోట్లు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఐదేళ్ల పాటు రూ.23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలన్నారు.

08/04/2016 - 15:35

దిల్లీ: ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. ఈ మేరకు ఆయనకు ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్‌మెంటు మంజూరైంది. ప్రధానితో భేటీ సందర్భంగా ఎపికి ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించనున్నట్టు సమాచారం. ఈ రోజు సాయంత్రం చంద్రబాబు దిల్లీ చేరుకుని కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా రాష్టప్రతి, ఇతర ప్రముఖులను కలుస్తారు.

08/04/2016 - 15:35

విజయవాడ: కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ గురువారం ఇక్కడ ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళావెంకట్రావును కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. సుమారు పది నిమిషాల సేపు వీరి భేటీ కొనసాగింది. టిడిపిలో చేరేందుకు నిర్ణయించుకున్నందునే నెహ్రూ కళాను కలిశారని సమాచారం.

08/04/2016 - 15:34

కాకినాడ: ఎపికి ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ సిద్ధమేనా? అని కాపు ఉద్యమనాయకుడు ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. తనవి దొంగదీక్షలని అంటున్నవారు దీక్షలు చేయగలరా? అని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. ప్రత్యేకహోదా కోసం చంద్రబాబుతో పాటు తాను కూడా దీక్షలో కూర్చుంటానని, అపుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలుగుతారో ప్రజలకు తెలుస్తుందన్నారు.

08/04/2016 - 15:33

గుంటూరు: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం రెండో బ్లాకులో హోం శాఖ కార్యాలయాన్ని రాష్ట్ర హోం మంత్రి ఎన్.చినరాజప్ప గురువారం ప్రారంభించారు. ఇక్కడి నుంచే తమ శాఖ కార్యకలాపాలన్నీ జరుగుతాయని ఆయన తెలిపారు. డిజిపి ఎన్.సాంబశివరావు, పోలీసు శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

08/04/2016 - 15:33

చిత్తూరు: ఎపికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం వైఖరికి నిరసనగా టిడిపి నాయకుడు, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు నగరి నియోజకవర్గంలో గురువారం భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వచ్చిన 15వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి పంపుతున్నట్లు ఆయన తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే ఎపి ప్రజలు కోరుతున్నారని అన్నారు.

08/04/2016 - 12:12

హైదరాబాద్: సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఇక్కడ ఎపి సచివాలయంలో రాష్ట్ర కార్మిక, క్రీడలశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని కలిశారు. హిందూపురం నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

08/04/2016 - 12:12

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో ప్రభుత్వ ఉద్యోగులంతా అంకితభావంతో, సమర్ధతతో పనిచేయాలని, ప్రజాసేవకు ఇదొక అరుదైన అవకాశమని సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష జరిపారు. పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికారులు, పోలీసులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. రవాణా, పారిశుద్ధ్యం, మంచినీరు, భోజన సదుపాయాలు తదితర అంశాల్లో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదన్నారు.

Pages