S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/09/2016 - 04:36

కర్నూలు, ఆగస్టు 8: కర్నూలు జిల్లాలోని సప్తనదీ సంగమేశ్వరం వద్ద కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు, భద్రతా చర్యలను పరిశీలించేందుకు వెళ్లిన ఎస్పీ ఆకే రవికృష్ణ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఎస్పీ సోమవారం సంగమేశ్వరం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం ఆలయ శిఖరానికి పూజలు నిర్వహించడానికి ఇంజిన్ బోటులో వెళ్లారు. ఆయన వెంట కొందరు పోలీసు అధికారులు, మీడియా సిబ్బంది ఉన్నారు.

08/09/2016 - 04:35

న్యూఢిల్లీ,ఆగస్టు 8: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థిక సహాయం కోసం మాటిమాటికి ఢిల్లీకి వచ్చి అభ్యర్థించడం అత్యంత దురదృష్టకరమని అమలాపురం ఎంపీ పి రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్రబాబు సోమవారం జిఎస్‌టి బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ తమ పార్టీ దీనిని బలపరుస్తోందని అంటూనే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

08/09/2016 - 04:31

చిత్రం.. కృష్ణా పుష్కరాలకు రావలసిందిగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ను
ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

08/09/2016 - 04:27

హైదరాబాద్, ఆగస్టు 8: నవ్యాంధ్ర రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను అధిగమిస్తున్న బాబు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఐదు గ్రిడ్లను పూర్తి చేసేందుకు అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఇవి పూర్తయితే ప్రజలు ఎదుర్కొంటున్న కీలక సమస్యలు పరిష్కారమవుతాయన్న ప్రణాళికతో బాబు వాటిపై పూర్తి స్థాయి దృష్టి సారిస్తున్నారు.

08/09/2016 - 04:25

తిరుమల, ఆగస్టు 8: నిత్యం గోవింద నామస్మరణలతో మార్మోగే తిరుమలలో ఓ వృద్ధుడి ఆర్తనాదాలు అరణ్యరోదనలుగా మారాయి. కుష్ఠు వ్యాధితో బాధపడుతున్నప్పటికీ శ్రీవారిని దర్శించుకోవాలనే తపనతో తిరుమల చేరుకోవడం ఆ వృద్ధుడికి శాపంలా మారింది. బతికి ఉండి కదలలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు గోనె సంచిలో మూటగట్టి లారీలో తీసుకెళ్లి శ్మశానంలో పడేశారు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.

08/09/2016 - 04:23

విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 8: ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల్లోని అత్యంత కీలకమైన నదీ హారతి కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో హారతి కార్యక్రమం జరగబోతోంది. గోదావరి పుష్కరాల్లో కూడా బోయపాటి డైరెక్షన్‌లోనే నదీ హారతి కార్యక్రమం జరిగింది.

08/09/2016 - 04:22

హైదరాబాద్, ఆగస్టు 8: ఆంధ్రప్రదేశ్‌లో పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఎపిపిఎస్‌సి) ఆధ్వర్యంలో జరిగే గ్రూప్-2, గ్రూప్-3 రిక్రూట్‌మెంట్లకు సైతం స్క్రీనింగ్ పరీక్షను నిర్వహించనున్నారు. ఆంధ్రాలో 10 వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. అందులో 4,009 పోస్టులను ఎపిపిఎస్‌సి రిక్రూట్‌మెంట్ నిర్వహించనుంది. మరో 5,991 పోస్టులకు ఎపి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా ఎంపిక చేయనున్నారు.

08/09/2016 - 04:21

విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 8: అమరావతి సీడ్ స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ డెవలపర్ ఎంపికకు సంబంధించిన తుది కసరత్తుకు అధికారులు సిద్ధమయ్యారు. మాస్టర్ డెవలపర్ ఎంపిక బిడ్‌పై ఆసక్తి కనబరుస్తున్న సంస్థలతో ప్రీ బిడ్ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సిఆర్‌డిఏ) సోమవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించారు.

08/09/2016 - 04:21

విశాఖపట్నం, ఆగస్టు 8: రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు బలహీన పడటంతో కోస్తాంధ్రలో పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 5 డిగ్రీల వరకూ అధికంగా కొన్ని చోట్ల సోమవారం నమోదు కావడం గమనార్హం. సాధారణం కంటే వాల్తేరులో 5 డిగ్రీలు, తుని, బాపట్ల, మచిలీపట్నం, విశాఖ విమానాశ్రయంలో 4 డిగ్రీలు అధికంగా నమోదు కావడం గమనార్హం. విశాఖ విమానాశ్రయంలో 36.2 డిగ్రీలు నమోదైంది.

08/08/2016 - 18:22

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వేతనాల పెంపుపై సోమవారం ఆర్థికశాఖ ఉత్తర్వులు, మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో సీనియర్‌ అసిస్టెంట్‌ క్యాడర్‌కు రూ.17,500, డ్రైవర్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ అసిస్టెంట్లకు రూ.15వేలు, వాచ్‌మెట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌లకు రూ.12వేలు చొప్పున కొత్తగా వేతనం అందనుంది. ఈ వేతనాలు ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చాయి.

Pages