S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితి

07/09/2017 - 23:14

మాటలొచ్చిన ఇనప్పెట్టిలో
దస్తావేజులెందుకుంటాయి
కట్టలు కట్టిన ఆత్మలుంటాయి కాని

రహస్య బిలంలాంటి మా ఇనప్పెట్టి
అరల్లోపలి అరల్లో ఎక్కడో
బొమ్మలేవో వేసుకుంటూ
నా చిన్నప్పటి నేను కూర్చునే ఉంటాను

07/09/2017 - 23:13

అపసవ్య దిశలో అడుగులేస్తున్న సామాజిక జీవితాన్ని ఎత్తిచూపుతూ, అందలి తప్పిదాలను తట్టి చెబుతూ పొరపాట్లను విప్పి చూపిస్తూ సమాజాన్ని సవ్యమైన మార్గంలో పెట్టేందుకు దోహదపడే కళారూపాల్లో ‘‘సాహిత్యం’’ ప్రముఖమైనదిగా పేర్కొనవచ్చును.

07/09/2017 - 23:12

సుమిత్ర ఆ ఊరికి కొత్తగా కాపురానికి వచ్చిన పిల్ల. పెళ్లి ఊరేగింపు సమయంలోనే తన బాల్య స్నేహితురాలిని ‘రుక్మిణి’ని చూస్తుంది. ఆ రుక్మిణిలో వెనకటి చలాకీతనం, చురుకు లోపించినాయని గమనిస్తుంది. దీనికి కారణం ఏమిటో కనుక్కోవాలని తన మనస్సులోనే నిర్థారణ చేసుకుంటుంది.

07/09/2017 - 23:11

‘పారిజాతాపహరణం చెట్టు దొంగతనమా?’ (ఆంధ్రభూమి తేది 3-7-17) అన్న రామతీర్థగారి వ్యాసంపై ప్రతిస్పందన).. ఒక కోతికి కొబ్బరికాయ దొరికిందట! ఇంకేం? దాన్నది అటు త్రిప్పీ, ఇటు త్రిప్పీ చూసింది. వాసన చూసింది. కొరికి చూసింది. పెరికి చూసింది. ఎగరేసీ, పగలేసీ చూసింది. చివరికి విసిగి, వేసారి అదొక పనికిరాని వస్తువంటూ తిట్టుకుంటూ దూరంగా పెంటకుప్పపైకి విసిరేసిందట!...

07/02/2017 - 21:16

‘ఉ్పళూక ఆ్దజశ క్యఖ ష్ఘశ జ్ఘ్జౄశళ జఒ గళ్ఘ’’
-్ఘఇ్య -జష్ఘఒఒ్య

07/02/2017 - 21:15

చెట్టుపై తను రాసిన పద్యం
బాగా వచ్చిందన్న ఆనందంతో కవి..
కవిత రాసిన కాగితంలోని
చెట్టు ఆత్మ మాత్రం
ఆ పద్యం
సమాధి రాయిపై రాసిన
స్మృతిగీతంలా వుందనుకుంది
చెట్టుపై నీ ప్రేమ
నా బొందలా
వుందనుకుని నిట్టూర్చింది
శ్రోతల చప్పట్ల హోరులో
చెట్టు నిట్టూర్పు
ఎలా వినిపిస్తుంది కవికి?

07/02/2017 - 21:17

మనసు సాగరంనుండి
వౌనం అంచులు దాటి
అలల్లా హృదయాన్ని తాకే
అందమైన భావాలు..
కాగితంతో జతకడితే
ముగ్ధమనోహర
అక్షర సుమం విచ్చుకుంటుంది!
తన పెదాలపై
సుతారంగా చందమామ చేసే
సంతకంతో..
నదీమ తల్లి ఆనంద డోలికల్లో
ఓలలాడుతుంది!
నింగి ప్రసాదించే
చినుకు పూలకు
చిరుగాలి లాలిపాట తోడై
తొలకరి నేలను స్పృశించగానే..

07/02/2017 - 21:14

వర్తమాన సామాజిక పరిస్థితులను కథానికలు ప్రతిబింబించాలి’ అనేవారు అనేకులు అయినా ‘అంతమాత్రం చాలదు, కథలకు సర్వకాలీనత వుండాలి’ అనేవారూ జగత్తులో ఎక్కువ మందే ఉన్నారు. ఇరుతెగలవారికీ సంతృప్తిని ఇచ్చే కథానిక శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీగారి ‘కలుపుమొక్కలు’.

07/02/2017 - 21:13

అవును, అని కథ తెలిసిన ముక్కుపచ్చలారని కుర్రాడు కూడా అనడు. అవును, చెట్టు దొంగతనమే అంటున్నారు, నలభై ఏళ్ళుగా అమెరికాలో తెలుగు బోధిస్తూన్న అనువాద అఘాయిత్య ఆచార్య వెల్చేరు నారాయణరావు. వీరి ఎమొరీ విశ్వవిద్యాలయపు సి.వి. ప్రకారం, ఈయన వెలువరించబోతున్న అనువాదాల్లో ఈ పుస్తకం పేరు ఉన్నది. ఆనాడు, నంది తిమ్మన పదహారో శతాబ్దిలో రాసిన ప్రణయ ప్రబంధం పారిజాతాపహరణం.

06/25/2017 - 22:12

చిగురు లేత కొమ్మలంటే ఇష్టం
నాకు వసంత రుతువంటే మరీ ఇష్టం
నీవు వాటికంటే ఇష్టం

కోయిల పాటంటే ఇష్టం
నీ మాట దానికంటే ఇష్టం
నీరెండ పొలుపంటే ఎంతో ఇష్టం
గోధూళీ పసిడివొనె్నలద్దుకున్న
నీ రూపు మరీ మరీ ఇష్టం

Pages