జాతీయ వార్తలు
ఎఫ్టీఐఐ ఛైర్మన్ బాధ్యతల స్వీకరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 7 January 2016
పుణె : ఓ పక్క విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. టీవీ నటుడు, భాజపా నేత గజేంద్ర చౌహాన్ పుణెలోని ఎఫ్టీఐఐ(ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా) ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఛైర్మన్గా ఆయన నియామకాన్ని నిరసిస్తూ విద్యార్థులు 139రోజులుగా ఆందోళన చేపట్టారు. ఏడు నెలల తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల మధ్య గజేంద్ర చౌహాన్నే తిరిగి ఛైర్మన్గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాన్ని నిలిపివేయాలంటూ అడ్డుకునేందుకు అక్కడికి వచ్చిన పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దాదాపు 40మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.