మెయిన్ ఫీచర్

మెరుపు తగ్గని ఫ్యాషన్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడూ నిత్య నూతనమే.. నిన్నటి ఫ్యాషన్ ఇవాళ్టికి మొహం మొత్తేస్తుంది.. ఇవాళ్టి ‘ట్రెండ్’ రేపటికి పాతదైపోతుంది.. అయితే- మగువల వస్తధ్రారణకు సంబంధించి కొన్ని ఫ్యాషన్లకు అనునిత్యం ఆదరణే.. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టినా కొన్ని పాత ఫ్యాషన్లకు మాత్రం ఎప్పటికీ డిమాండ్ తగ్గదు.. సినీతారలు, ప్రముఖ క్రీడాకారిణులు, ఇతర సెలబ్రిటీలు వేసుకునే డ్రెస్‌లంటే యువతులు ఎంతో మోజు పడుతుంటారు. సినిమాల్లో హీరోయిన్లు వేసుకునే స ల్వార్ కమీజ్‌లు, కట్- అవుట్ గౌన్లు, జీన్స్, ప్యాంట్‌సూట్లు, భుజాల కిందుగా వేలాడే షర్టులు, సంప్రదాయ దుస్తులపై చకీల నగిషీలు.. ఇలా కొన్నిరకాల డిజైనర్ దుస్తులకు ఏళ్లు గడిచినా ఆదరణ ఏ మాత్రం తగ్గదు. సెలబ్రిటీల వస్తధ్రారణను అనుకరిస్తూ నేటితరం యువతులు విందులు, వేడుకలకు వెళ్లేందుకు ముచ్చట పడుతున్నారు. బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, సోనమ్ కపూర్, దీపిక పదుకొనె, జాక్విలిన్ ఫెర్నాండెజ్, సోనాక్షి సిన్హా సినిమాల్లో వేసుకునే కట్-అవుట్ గౌన్లు, జీన్స్, డెనిమ్స్, సల్వార్ కమీజ్‌లకు మార్కెట్‌లో విపరీతమైన క్రేజ్ ఉందంటే అందుకు టీనేజీ యువతులు మనసు పారేసుకోవడమే కారణం. వస్తధ్రారణలోనే కాదు, నగల అలంకరణలోనూ ఈకాలపు అమ్మాయిలు సెలబ్రిటీలనే అనుకరిస్తూ నలుగురిలో వైవిధ్యం చాటుకోవాలని ఆరాటపడుతున్నారు.