జాతీయ వార్తలు

భిన్నత్వమే భారత్ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగ హక్కులకు పూర్తి రక్షణ
ఆర్థిక మాంద్యంలోనూ అభివృద్ధి వేగం
అభివృద్ధి ఫలాలు అందరికీ.. ఉగ్రవాదం ప్రపంచ సమస్య
మలేసియా భారతీయ సదస్సులో మోదీ
కౌలాలంపూర్, నవంబర్ 22: భిన్న మతాలు, కులాల సహజీవన వైవిధ్యమే భారతకు తిరుగులేని శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో అసహన ధోరణులు పెరిగిపోతున్నాయన్న విమర్శల నేపథ్యంలో ఆదివారం ఇక్కడ ప్రవాస భారతీయులనుద్దేశించి మాట్లాడిన ఆయన ‘భిన్నత్వంలో ఏకత్వం భారతీయ లక్షణం. భాషలు, మతాలు, కులాలు సమ్మిళితంగా జీవిస్తున్న దేశం భారత్’అని పేర్కొన్నారు. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పిస్తున్న ప్రాథమిక హక్కులకు పూర్తి రక్షణ ఇస్తున్నామని తెలిపారు. వీటికి ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని, ఏ మాత్రం తేడా ఉన్నా పౌరుల హక్కుల రక్షణకు న్యాయస్థానాలు ఉన్నాయన్నారు. వణక్కం అంటూ తన ప్రసంగాన్ని మొదలెట్టి ముప్పావు గంటపాటు మాట్లాడిన మోదీ వర్తమాన భారత అభివృద్ధి అవకాశాల నుంచి ఐసిస్, అంతర్జాతీయ ఉగ్రవాదం, ఇంటర్‌నెట్ తీవ్రవాదం వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఎన్నో అద్భుతమైన విజయాలను అన్ని రంగాల్లోనూ భారత్ నమోదు చేసుకుందన్నారు. నిరుపమానమైన వైవిధ్యానికి, సామజిక, రాజకీయ సవాళ్లకు భారత్ పెట్టింది పేరన్నారు. రెండు శతాబ్దాలకు పైగా సాగిన వలసపాలనలో అన్ని విధాలుగా బలహీన పడిన భారతావని అసలు శైశవదశమైనా దాటుతుందా అన్న అనుమానాలు అప్పట్లో కలిగాయని, కొందరికి అసలు భారత దేశం ఎదగడం ఎంతమాత్రం ఇష్టమేలేదని మోదీ తెలిపారు. కానీ, నేటి భారతం సమైక్యతకు నిలయంగా భాసిల్లడంతో పాటు భిన్నత్వంలో ఏకత్వం నుంచే ఎప్పటికప్పుడు ఎనలేని శక్తిని పొందుతోందని అన్నారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత దేశం 7.5శాతం వృద్ధితో ముందుకు దూసుకుపోతోందన్నారు. భారత దేశం ఈ స్థాయికి చేరుకోవడం ఎందరో నేతల కృషి ఫలితమేనని తెలిపారు. వర్తమాన భారతం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు అన్ని విధాలుగా గుణాత్మక మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతోనే తాము పగ్గాలు చేపట్టామన్నారు. ఆధునిక ఆర్థిక అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించడం ద్వారా పేదరిక నిర్మూలనా లక్ష్యాలను ముందుకు తీసుకెళుతున్నామన్నారు. బ్యాంకులు, బీమా సేలను దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తెచ్చామని స్పష్టం చేసిన మోదీ ‘కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే 190మిలియన్ బ్యాంకు ఖాతాలు తెరుకుకోవడం అన్నది భారత్‌లో తప్ప ప్రపంచంలో మరెక్కడైనా జరిగిందా..’అని ప్రశ్నించారు. ఉగ్రవాదానికి ఎల్లలు లేవని, ఇది ప్రపంచానికే పెను సవాలని అన్నారు. అంతర్జాతీయ శాంతి భద్రతల పరిరక్షణలో భారత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని, ప్రాంతీయ భద్రత, సుస్థిరతకు దేశ సైనిక దళాలు గురుతర బాధ్యతను నిర్వర్తిస్తున్నాయని చెప్పారు. ఏ దేశం కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునివ్వడం ద్వారా పాకిస్తాన్ తీరును పరోక్షంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని పెంపొందించడానికి ఇంటర్‌నెట్‌ను సాధనంగా వాడుకునే ప్రయత్నాలను పరస్పర సహకారం ద్వారా తిప్పికొట్టాలన్నారు.