జాతీయ వార్తలు

72వ జయంతి సందర్భంగా రాజీవ్‌కు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా దేశ ప్రజలు శనివారం ఆయనను స్మరించుకున్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ సహా పలువురు నాయకులు ఈ సందర్భంగా రాజీవ్ సమాధి వద్ద ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నప్పటికీ ఆమె కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ న్యూఢిల్లీలోని ‘వీర్ భూమి’ (రాజీవ్ గాంధీ సమాధి)కి పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ దార్శనికత, విలువలు, ప్రజా సంక్షేమం పట్ల ఆయనకు గల నిబద్ధత అందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయని రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అయితే సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అంతకుముందు రాష్టప్రతితో పాటు ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (డిపిసిసి) అధ్యక్షుడు అజయ్ మాకెన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆనంద్ శర్మ, మోతీలాల్ వోరా, భూపీందర్ సింగ్ హుడా తదితరులు వీర్ భూమిని సందర్శించి రాజీవ్ గాంధీకి ఘనంగా అంజలి ఘటించారు.

చిత్రాలు..మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా శనివారం పార్లమెంటు హాలులో నివాళులర్పించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు.
మరో కార్యక్రమంలో ప్రముఖ గాయని శుభా ముద్గల్‌కు రాజీవ్ సద్భావనా అవార్డును అందజేస్తున్న కాంగ్రెస్ నేతలు