జాతీయ వార్తలు

పేదరిక నిర్మూలనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, ఆగస్టు 20: ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు విజయవంతం కావడం అనేది ‘బ్రిక్స్’ దేశాలు వాటి అమలులో విజయం సాధించడంపై ఆధారపడి ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాలను విజయవంతంగా అమలు చేయడానికి బ్రిక్స్ సభ్య దేశాలు ఒకే కూటమిగా పని చేయాలని అన్నారు. శనివారం ఇక్కడ రెండు రోజుల పాటు జరిగే బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటు సభ్యుల ఫోరమ్ సమావేశాన్ని సుమిత్రా మహాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత దేశ అభివృద్ధి అజెండా ఐరాస ప్రతిపాదించిన అభివృద్ధి అజెండాలో ప్రతిబింబిస్తోందని, పేదలకు సాధికారికత కల్పించడం ద్వారా పేదరికాన్ని తొలగించాలనే బాటను తాము ఎంచుకున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాలన్నీ కలిపితే ప్రపంచ జనాభాలో 43శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయని, ప్రపంచ జిడిపిలో 37 శాతం వాటా ఆ దేశాలదేనని, ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన సుస్థిర ప్రగతి లక్ష్యాలు విజయవంతం సాధించడం అనేది బ్రిక్స్ దేశాల్లో వాటిని విజయవంతంగా అమలు చేయడంపై చాలావరకు అధారపడి ఉందని అన్నారు. ఈ లక్ష్యాల సాధనలో బ్రిక్స్ దేశాల మహిళా పార్లమెంటేరియన్ల పాత్ర ఎంతో ఉందని, ఈ లక్ష్యాలు విజయవంతమయ్యేలా చూడాలని వారిని కోరారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 42 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. బ్రెజిల్‌నుంచి అయిదుగురు, రష్యానుంచి ముగ్గురు, భారత్‌నుంచి 28 మంది, చైనానుంచి ఇద్దరు, దక్షిణాఫ్రికానుంచి నలుగురు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. మన దేశంనుంచి హాజరవుతున్న వారిలో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, అరకు ఎంపి కొత్తపల్లి గీతతో పాటుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె తదితరులు ఉన్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె కూడా పాల్గొన్నారు.

చిత్రం.. బ్రిక్స్ దేశాల మహిళా ఎంపీల ఫోరమ్ సమావేశాన్ని ప్రారంభించేందుకు వస్తున్న స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు స్వాగతం పలుకుతున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె