జాతీయ వార్తలు

వృద్ధురాలిపై పిచ్చికుక్కల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 20: కేరళలో ఓ వృద్ధురాలిపై ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వంద పిచ్చికుక్కలు ఏకకాలంలో దాడిచేశాయి.. దొరికిన చోటల్లా కండలు ఊడబెరికాయి. ఒళ్లంతా రక్తస్రావం.. నిస్సహాయురాలైన మహిళ ఏమీ చేయలేక మృత్యువాతపడింది. కంజిరంకులమంలోని బీచ్‌లో ఈ ఘటన దేశమంతటా సంచలనం సృష్టించింది. 65 సంవత్సరాల సిలువమ్మ అదే తీర ప్రాంతంలో నివాసముంటోంది. రాత్రిపూట బీచ్‌కు వెళ్లిన ఆమెపై వందకుపైగా పిచ్చికుక్కలు విశృంఖలంగా విరుచుకుపడ్డాయి. ఆమెను రక్షించటానికి వెళ్లిన వారినీ తరిమితరిమి కొట్టాయి. దగ్గరకు వెళ్లిన కొడుకు సెల్వంపైనా దాడి చేశాయి. సముద్రంలోకి దూకి అతను తప్పించుకున్నాడు. ఒంటినిండా గాయాలతో ఉన్న సిలువమ్మను స్థానిక వైద్యకళాశాల ఆసుపత్రికి తరలించి రాబీస్ ఇంజక్షన్ వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. మరోవైపు పుల్లువిలా ప్రాంతంలో కూడా ఓ 52 ఏళ్ల మహిళపై కూడా పిచ్చికుక్కలు దాడి చేసాయి. కేరళలో గత కొంతకాలంగా పిచ్చికుక్కల బెడద పెరిగిపోయింది. దీనిపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది.