జాతీయ వార్తలు

మణిపూర్ గవర్నర్‌గా నజ్మా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: మణిపూర్, అసోం, పంజాబ్ రాష్ట్రాలకు గవర్నర్‌లను, అండమాన్ నీకోబార్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా, పంజాబ్ గవర్నర్‌గా విపి సింగ్ బద్నోర్, అసోం గవర్నర్‌గా బన్వారీలాల్ పురోహిత్, అండమాన్ నీకోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రొఫెసర్ జగదీష్ ముఖీ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్టప్రతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది. 76 సంవత్సరాల నజ్మా హెప్తుల్లా వయసు కారణంగా ఇటీవలే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మేఘాలయ గవర్నర్‌గా ఉన్న వి షణ్ముఖనాధ్ మణిపూర్ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అసోం గవర్నర్‌గా నియమితమైన బన్వారీలాల్ పురోహిత్ మూడుసార్లు నాగ్‌పూర్ లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఆయన ‘ది హితవాద’అనే పత్రికకు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన 68ఏళ్ల బద్నోర్‌ను వచ్చే ఏడాది ఎన్నికలను ఎదుర్కొంటున్న పంజాబ్‌కు గవర్నర్‌గా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకి పంజాబ్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. నాగాలాండ్ గవర్నర్‌గా ఉన్న పద్మనాభ బాలకృష్ణ ఆచార్య అసోం గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ అదనపు బాధ్యత నుంచి ఆచార్యను తప్పించడానికే 76 సంవత్సరాల పురోహిత్‌ను నియమించారు. అండమాన్ నీకోబార్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితమైన జగదీష్ ముఖి 73ఏళ్ల ఢిల్లీ అసెంబ్లీలో జనక్‌పురి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నలుగురూ కూడా కేంద్రంలోని అధికార బిజెపితో దీర్ఘకాల అనుబంధం కలిగి ఉన్నవారే కావడం గమనార్హం.

చిత్రం.. నజ్మా హెప్తుల్లా విపి సింగ్ బద్నోర్