జాతీయ వార్తలు

యూపీ ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించాలని బిఎస్పీ అధినేత మాయావతి కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను వాయిదా వేయించడానికి సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ ఎత్తులు వేస్తున్నారని బుధవారం ఇక్కడ ఆరోపించారు. బిజెపి, ఎస్‌పిలు రెండు పార్టీలూ ఎన్నికలు వాయిదా వేయించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమె తెలిపారు. ఎన్నికల సంఘం వెంటనే రంగంలోకి దిగాలని, జనవరి, ఫిబ్రవరి మధ్యలో ఎన్నికలు జరిగేలా షెడ్యూల్ ప్రకటించాలని మాజీ ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు పూర్తిచేయాలన్నది రాష్ట్ర ప్రజల అభిమతమని ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యూపీలో రాష్టప్రతి పాలన పెట్టడానికి గతంలో ప్రయత్నించిందని మాయావతి ఆరోపించారు. అయితే రాష్ట్రంలో పట్టులేని బిజెపి అందుకు సాహసం చేయలేకపోయిందని ఆమె పేర్కొన్నారు. ములాయం సింగ్ యాదవ్ మైండ్ గేమ్ ఆడుతున్నారని బిఎస్పీ అధినేత్రి విమర్శించారు. పార్టీలో గొడవను రాష్ట్ర ప్రజలదిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.