జాతీయ వార్తలు
అది ఆక్రమిత కాశ్మీరే?!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 17 August 2016
న్యూఢిల్లీ, ఆగస్టు 16: పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో చైనా వైఖరి మారుతుందా? నిన్న మొన్నటి వరకూ పాకిస్తాన్‌ను అన్ని విధాలుగా వెనకేసుకొచ్చిన చైనా కొత్త వ్యూహంతో ముందుకెళుతోందా? తాజాగా ఆక్రమిత కాశ్మీర్‌ను పాక్ పాలనలో ఉన్న ప్రాంతంగా కాకుండా పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్‌గా చైనా పేర్కొనడాన్ని బట్టి చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన ఓ వ్యాసంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ అన్న పదం పలుమార్లు కనిపించింది. కాశ్మీర్ విషయంలో చైనా తటస్థవైఖరినే అవలంబిస్తుందని, ఇటు పాకిస్తాన్‌ను గానీ, అటు భారత్‌ను గానీ బలపరిచే అవకాశం లేదని ఆ వ్యాసం స్పష్టం చేసింది.